Big Stories

Bridge Collapsed in Bihar: కుప్పకూలిన అతిపెద్ద బ్రిడ్జి.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు

Bridge Collapsed
Bridge Collapsed

Bridge Collapsed in Bihar: నిర్మాణంలో ఉన్న ఇండియాలోని అతిపెద్ద బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. బీహార్ లోని సుపాల్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ వంతెన మూడు పిల్లర్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ ఘటనపై స్థానికులు వెంటనే భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

బీహార్ లోని కోసి నదిపై మధుబని, సుపాల్ మధ్య నిర్మిస్తున్న వంతెన ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఉదయం వంతెన పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటన బేజా, బకౌరా మధ్యలో ఉన్న మరీచాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది గాయాలపాలయ్యారు.

- Advertisement -

నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో వంతెన కూలిపోవడం వల్ల సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో భద్రతా సిబ్బంది చేరుకుని సహాయచర్యలు చేపడుతుంది. దీనికి స్థానికులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని పాల్గొంటున్నారు. వంతెన కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జి కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

Also Read: Kavitha EC Custody : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. మరో మూడురోజులు పొడిగిస్తారా ?

రూ. 1200 కోట్లతో ఈ వంతెనను కోసి నదిపై ప్రభుత్వం నిర్మిస్తుంది. దాదాపు 10. 2 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. మొత్తం 171 పిల్లర్లతో ఈ అతిపెద్ద వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో 150 పిల్లర్ల నిర్మాణం పూర్తైంది. ఈ క్రమంలోనే పూర్తైన పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 50,51,52 పిల్లర్లు ప్రస్తుతం కూలిపోయాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News