Big Stories

Patanjali Case: ‘బహిరంగ క్షమాపణలు చెప్పాలి’.. మీరేం అమాయకులు కాదు.. రాందేవ్ బాబాపై సుప్రీం సీరియస్

 

- Advertisement -

Patanjali Case: పతంజలి తప్పుడు ప్రకటన కేసులో పతంజలి ఆయుర్వేజ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నేడు జరిపిన విచారణలో భాగంగా గత ఉత్తర్వుల గురించి ప్రస్తావించింది. గత ఉత్తర్వుల్లో అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీం సీరియస్ అయింది. ఈ కేసులో తమ తప్పును అంగీకరిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు వారం రోజులపాటు గడువును ఇచ్చింది.

- Advertisement -

తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా అలోపతిని తగ్గించి చూపించడంపై ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్ధీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈ తరుణంలో నేడు విచారణకు రాందేవ్ బాబా హాజరయ్యారు. న్యాయస్థానానికి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. తాము చేసింది తప్పే అని అంగీకరించారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం అన్నారు. కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.

కాగా, పతంజలి అలోపతి విధానాలపై తప్పు దోవ పట్టించేలా ప్రకటనలు చేశారని నవంబర్ లో రాందేవ్ బాబాను నిందితుడిగా పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన న్యాయస్థానం బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా రాందేవ్ బాబా గత ఉత్తర్వులను పాటించకపోవడంతో తాజాగా మరోసారి కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కోర్టుకు హాజరైన రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News