BigTV English

Cm Stalin – NEP : మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న తమిళనాడు – అసలు వారికొచ్చిన సమస్యేంటి

Cm Stalin – NEP : మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న తమిళనాడు – అసలు వారికొచ్చిన సమస్యేంటి

Cm Stalin – NEP : మరోసారి తమిళనాడు రాష్ట్రం భాష యుద్ధానికి సిద్ధంగా ఉంది అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిక్ హెచ్చరించారు. జాతీయ విద్యావిధానం ద్వారా హిందీని అన్ని రాష్ట్రాల్లో ఓ సబ్జెక్టుగా బోధించాలని కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో.. దానిని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. తమకు హిందీ మాట్లాడాల్సిన అవసరం లేదని.. తమిళనాడులో తమిళం, ఇంగ్లీష్ భాషలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే.. లోక్ సభ సీట్ల పునర్విభజనలో రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని, ఇక్కడి సీట్లు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించి ఎంకే స్టాలిక్.. మార్చి 5న తమిళనాడులో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.


యుద్ధానికి మేం సిద్ధం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దుతోందని ఆరోపించిన ఎంకే స్టాలిన్.. మరో భాషా యుద్ధానికి విత్తనాలు నాటుతుందని, దానికి తాము సిద్ధంగానే ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. జాతీయ విద్యా విధానం (NEP) కింద ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని పాలక ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడు తన ద్విభాషా వ్యవస్థనే కొనసాగిస్తోందని అంటోంది. అక్కడ.. తమిళం, ఆంగ్లాన్ని మాత్రమే కొనసాగిస్తామని పట్టుబడుతోంది. కాగా.. హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అనే ఆరోపణల్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రతీ రాష్ట్రం మూడు భాషలు అమలు చేసేందుకు వీలుందని.. అందులో వారి స్థానిక భాషతో మాటు మరో రెండు భాషలకు అవకాశం ఉందని, అందులో హిందీకి చోటు కల్పించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు. అలాంటప్పుడు హిందీని బలవంతంగా రుద్దినట్లు ఎలా అటుతుందని ప్రశ్నిస్తున్నారు.


పార్లమెంట్ స్థానాలు తగ్గుతున్నాయి

రాష్ట్ర కేబినేట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన స్టాలిన్.. రాష్ట్రం కుటుంబ నియంత్రణ విధానాల్ని పకడ్భందీగా అమలు చేయడం వల్ల 8 స్థానాల్ని కోల్పోతుందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం అంటూ ప్రవేశపెట్టిన విధానాన్ని అమలు చేసినందుకు.. తమకు పార్లమెంట్లో సీట్లు తగ్గిస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు.. దక్షిణాధి రాష్ట్రాలు పోరాడాలని సూచించిన ఎంకే స్టాలిన్, లోక్‌సభ డీలిమిటేషన్ అంశంపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్‌లో నమోదు చేసుకున్న అన్ని రాజకీయ పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపిన స్టాలిన్.. పార్టీలు విభేదాలను పక్కనపెట్టి ఏకైక లక్ష్యం కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. NEP, NEET కేంద్ర నిధుల కేటాయింపులు వంటి విధానాలను సవాలు చేయడానికి పార్లమెంటులో తమిళనాడుకు బలమైన గొంతుక ఉండాలంటున్నారు. ప్రస్తుతం దక్షిణాధి రాష్ట్రాలను పార్లమెంట్లో మరింత బలహీన పరించేందుకు డీలిమిటేషన్ ను అమలు చేసేందుకు సన్నద్ధమవుతోందని అంటున్నారు.

తమిళనాడు గొంతు నొక్కుతున్నారు

జనాభా గణాంకాల ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుందని, డీలిమిటేషన్ తర్వాత పార్లమెంటులో రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు అన్ని అభివృద్ధి సూచికలలో అద్భుతంగా రాణించింది.. వాటిలో జనాభా నియంత్రణ కూడా ఒకటని అన్నారు. కానీ.. జనాభా పెరుగుదలను నియంత్రించడం వల్లే లోక్‌సభ స్థానాలను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా అమలు చేయనున్న పార్లమెంట్ స్థానాల పునర్విభజన కారణంగా.. ప్రస్తుతం ఉన్న 39 స్థానాలకు బదులుగా 31 ఎంపీ స్థానాలే వస్తాయని అన్నారు. ఇది తమిళనాడు హక్కులకు సంబంధించిన విషయమన్నారు. పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, తద్వారా వారి గొంతు బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×