BigTV English

Biryani Day: వరల్డ్ బిర్యానీ డే.. ప్రత్యేకతలివే..!

Biryani Day: వరల్డ్ బిర్యానీ డే.. ప్రత్యేకతలివే..!

Biryani Day : బిర్యానీ.. ఇది భారతీయుల ఫేవరేట్ ఫుడ్ ఐటమ్ . సినీ ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్స్ లాంటి సెలబ్రిటీలతోపాటు సామాన్యులు అమితంగా ఇష్టపడే వంటకం బిర్యానీ. ప్రతి ఒక్కరు ఈ ఆహారాన్ని ఎంతో ఇష్టపడతారు. ఘుమఘుమలాడే బిర్యానీని ఆరగిస్తే ఆ కిక్కే వేరు . ఆదివారం వచ్చిందంటే బిర్యానీకి డిమాండ్ మరి ఎక్కువ. సోషల్ మీడియాలోనూ బిర్యానీ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. బిర్యానీ హ్యాష్‌ట్యాగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.8 మిలియన్ల సార్లు వాడారంటే ఈ వంటకాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతోంది.


దేశంలో భోజప్రియులు 2020లో నిమిషానికి 90 బిర్యానీలు ఆర్డర్ చేశారు. 2021లో బిర్యానీ ఆర్డర్ల సంఖ్య నిమిషానికి 115 కు పెరిగింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ లో 6 కోట్లకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు ఇచ్చారు. దేశంలో ప్రతి నెలా 4.7 మిలియన్ సార్లు బిర్యానీ గురించి ఇంటర్నెట్ లో సెర్చింగ్ చేస్తున్నారు. ఆదివారం బిర్యానీకి భారీగా డిమాండ్ ఉంది.

బిర్యానీకి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ వంటకం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైనదిగా మారింది. ఈ వంటకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానానికి గుర్తుగా ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ దావత్ బాస్మతి రైస్ జూలై 2న ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించింది.


దేశంలో ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బిర్యానీకి ఒక్కో టేస్ట్ ఉంటుంది. రుచిలో దేని ప్రత్యేకత దానిదే. హైదరాబాద్ దమ్ బిర్యానీకి పాపులారిటీ మరీ ఎక్కువ. కర్ణాటకలో దొన్నె బిర్యానీ, కోల్ కతాలో ఆలూతో చేసే పక్కీ బిర్యానీ, లక్నోలో అవధి బిర్యానీ, తమిళనాడులో అంబూర్ బిర్యానీ , కేరళలో మలబార్ బిర్యానీలకు డిమాండ్ ఎక్కువ. ఇంకా కొత్తకొత్త బిర్యానీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. బొంగులో బిర్యానీ, అవకాయ బిర్యానీ, మండి బిర్యానీ ఇలా కొత్త రుచులను భోజన ప్రియులకు పరిచయం చేస్తున్నారు.

బిర్యానీ డే సందర్బంగా స్విగ్గీ ఆసక్తికర వివరాలు ప్రకటించింది. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.ప్రతి నిమిషానికి 219 బిర్యానీ ఆర్డర్లు అందించామని పేర్కొంది. లక్నో బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, మలబార్ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ కోసం ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారని తెలిపింది. గత 6 నెలల్లో దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు అందించామని వివరించింది. ఏడాదిలో హైదరాబాద్‌లో 1.5 కోట్ల బిర్యానీ ఆర్డర్లు అందించామని స్విగ్గీ తెలిపింది. దమ్ బిర్యానీ కోసం అత్యధికులు ఆర్డర్ చేశారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా స్విగ్గీ బిర్యానీ ఆర్డర్లలో ప్రతి ఐదింటిలో ఒకటి హైదరాబాద్ నుంచే కావడం విశేషం.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×