BigTV English

TDP : మంత్రి ఇలాకాలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎంపీ, ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే..?

TDP : మంత్రి ఇలాకాలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎంపీ, ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే..?

TDP : శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడి ఇంటి ముందు కల్వర్టు కూల్చివేతకు అధికారులు ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు 15 ఏళ్ల క్రితం తన ఇంటికి రహదారి నిర్మించుకున్నారు. ఈ దారిలో సాగునీటి కాలువపై కల్వర్టు నిర్మించారు. ఈ నిర్మాణం అక్రమం అంటూ తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.


కల్వర్టు వల్ల నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేదని నాగరాజు అంటున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా కల్వర్టును తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఆయనకు సంఘీభావంగా ఘటనా స్థలానికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.

కల్వర్టు కూల్చివేతపై అధికారులు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేత నాగరాజు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×