Top 10 Clean Cities India | 140 కోట్లకు పైగా జనాభాతో నిండిన భారతదేశంలో పరిసరాల పరిశుభ్రత అనే అంశం గూగుల్ లో వెతకడం అనివార్యమైంది. ప్రజలలో సరైన అవగాహన మరియు చైతన్యం లేకపోవడం వల్ల మన దేశంలో చాలా నగరాలు అపరిశుభ్రతకు ప్రతీకగా నిలిచాయి. ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ, చెన్నై వంటి నగరాల పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. భయంకరమైన కాలుష్యానికి తోడు సరైన డ్రైనేజీ వ్యవస్థ మరియు మురుగు నిర్వహణ లేకపోవడం వల్ల మన నగరాలు ఇలా అపరిశుభ్రంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో టాప్ టెన్ పరిశుభ్రమైన నగరాలు ఏవి? అనే ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ప్రభుత్వంలోని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016 నుంచి “స్వచ్ఛ సర్వేక్షణ్” పేరుతో ప్రతి సంవత్సరం ఒక సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో పౌరుల అభిప్రాయాల సేకరణ, నగరంలోని కీలక ప్రాంతాల తనిఖీలు జరుగుతాయి. వీటితో పాటు ప్రజలకు వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పిస్తారు.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. అంతేకాకుండా, భారతదేశంలోని కొన్ని నగరాల్లో చెట్ల సంఖ్య పెంచి పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు ప్రోత్సహిస్తూ, శుభ్రమైన నగరాలుగా మార్చడం చాలా ముఖ్యం. భారతదేశంలో పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తున్న నగరాలు కొన్ని ఉన్నాయి. ఈ నగరాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా నగరాల పరిశుభ్రతను కాపాడుకుంటున్నారు. ఎవరైనా భారతదేశాన్ని పర్యటించాలనుకుంటే, ఈ క్లీన్ సిటీస్ ను ఎంపిక చేసుకోవచ్చు. కళ్ళకు అందాన్ని, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ఈ నగరాలను ఎంపిక చేసుకుని టూర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 2023-24 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే డేటా ప్రకారం టాప్ టెన్ పరిశుభ్రమైన నగరాలు ఇలా ఉన్నాయి:
1. ఇందోర్ (Indore): భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో మొదటి స్థానంలో ఇందోర్ నిలిచింది. ఈ సిటీలో చెత్తను సెగ్రిగేట్ చేయడం (తడి, పొడి చెత్తను వేరుగా ఉంచడం) వల్ల వేస్ట్ టు కంపోస్ట్ (తడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ)సిస్టంని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇందోర నగర వాసులు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వం పరిశుభ్రత కోసం ఏదైనా కార్యక్రమాలు చేపడితే ఇక్కడి ప్రజలు అందులో చురుగ్గా పాల్గొంటారు. ఫలితంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా, పరిశ్రమలు ఉన్నా.. ఇందోర్ నగరంలో చెత్త చెదారం కనిపించదు.
Also Read: కుంభమేళలో యువతుల స్నానాలు – అమ్మకానికి వీడియోలు
2. సూరత్: గుజరాత్ లోని సూరత్ నగరంలో మంచి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. రెగులర్ గా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి చెత్త సేకరణ, వీధులను శుభ్రంగా ఉంచడంతో పాటు మంచి మురుగు వ్యవస్థ కూడా ఉంది. ముఖ్యంగా సూరత్ ప్రజలు పరిశుభ్రతకు పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఇళ్లతోపాటు మార్కెట్లు కూడా క్లీన్ గా కనిపిస్తాయి అందుకే సూరత్ దేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో రెండో ర్యాంక్ సంపాదించింది.
3. నవి ముంబై (Navi Mumbai): ముంబై నగరాన్ని దేశ ఆర్థిక రాజధాని అని కూడా అంటారు. భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరంగా ముంబై ఉన్నప్పటికీ, ప్రస్తుతం క్లీన్ సిటీస్ జాబితాలో ముంబై లోని నవీ ముంబై ప్రాంతం.. స్థానం సంపాదించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.1971 నుంచి ముంబైలో ప్రత్యేకంగా నవి ముంబై అభివృద్ధి చెందుతోంది. 2019లో ఈ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మించారు. ఈ నగరంలో మంచి ప్లానింగ్ తో నిర్మాణాలు జరిగాయి. చెత్త సేకరణ, ప్రజారోగ్యానికి నవీ ముంబై పరిపాలక వర్గం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రెగులర్ గా చెత్త రీసైక్లింగ్ డ్రైవ్స్ చేపట్టడం, పార్కులను, పబ్లిక్ స్థలాలను శుభ్రంగా ఉంచడంతో ఈ నగరానికి క్లీన్ ఇమేజ్ వచ్చింది.
4. విశాఖపట్నం (Visakhapatnam): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓడరేవు నగరం విశాఖపట్నం. ఈ నగరాన్ని వైజాగ్ అని కూడా పిలుస్తారు. సముద్రం వద్ద అందమైన బీచ్‌లు, చెత్త సేకరణ, మురుగు వ్యవస్థ నిర్వహణ ఈ నగరంలో బాగుంది. రోడ్లు, పబ్లిక్ స్థలాల్లో శుభ్రంగా కనిపిస్తాయి. రెగులర్ గా క్లీన్ అప్ డ్రైవ్స్ చేపట్టడంతో ఈ పోర్టు నగరం స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే లో నాలుగో స్థానంలో నిలిచింది.
5. భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరం. దీన్నే సరస్సు నగరం అని కూడా పిలుస్తారు. నగరంలో అనేక కృత్రిమ సరస్సులు సిటీ అందాన్ని పెంచుతాయి. 1984 భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత నుంచి భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా భోపాల్ విప్లవాత్మక మార్పు చూసింది.
6. విజయవాడ (Vijayawada): ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండో నగరం విజయవాడ. ఈ నగరంలో వేస్ట్ మేనేజ్‌మెంట్, రెగులర్ రోడ్లు క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. చెత్త సేకరణ, చెత్త రీసైక్లింగ్ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతూ ఉండడంతో విజయవాడ క్లీన్ సిటీగా పేరుందొంది.
7. న్యూఢిల్లీ: దేశరాజధాని అయిన ఢిల్లీలో రెండు చట్టబద్ధమైన పట్టణాలు ఉన్నాయి. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్, ఢిల్లీ కంటోన్మెంట్. ప్రపంచంలో అతిపెద్ద, 2వ అధిక జనాభా కలిగిన మెట్రోపాలిస్ నగరం ఢిల్లీ. లక్షద్వీప్, చండీగఢ్ తరువాత అత్యధిక పచ్చదనంతో కూడిన యూనియన్ టెర్రిటరీ అయిన న్యూఢిల్లీ పరిశుభ్రతలో నాలుగవ స్థానంలో ఉంది.అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం, యమునా నది కాలుష్యం ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కానీ ఢిల్లీ ప్రజలు పరిశుభ్రతను కాపాడుకోవటానికి శ్రమిస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం వల్ల ఢిల్లీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత వ్యవస్థ నిర్వహణ బాగుంది.
8. తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రదేశం తిరుపతి. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం ఈ నగరంలోనే ఉంది. 2012లో తిరుపతి నగరం.. బెస్ట్ హెరిటేజ్ సిటీగా పురస్కారం అందుకుంది. తిరుపతిలో ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్ లో భాగంగా పారిశుధ్యం దృష్ట్యా బయో డిగ్రేడెబుల్ వస్తువులు ఉపయోగం ఎక్కువ. ఇక్కడి రోడ్లు , వీధులు చాలా శుభ్రంగా ఉంటాయి.
9. హైదరాబాద్ (Hyderabad): హైదరాబాద్ నగరంలో వేస్ట్ సెగ్రిగేషన్, రీసైక్లింగ్ నిర్వహణ విషయంలో జీహెచ్ఎంసీ మంచి ప్లానింగ్ చేస్తోంది. అందుకే దేశంలోని టాప్ 10 క్లీన్ సిటీస్ లో హైదరాబాద్ కు చోటు దక్కింది. నగరంలోని కమ్యూనిటీ పార్కులు, వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టం, క్లీన్ వీధుల వల్లే ఈ ఇమేజ్ వచ్చింది.
10. పుణె: టాప్ టెన్ క్లీన్ నగరాల్లో చివరి స్థానంలో మహారాష్ట్రకు చెందిన పుణె ఉంది. ఇక్కడ వేస్ట్ సెగ్రిగేషన్ చేసి కంపోస్టింగ్ కార్యక్రమలు చేపడుతున్నారు. పుణె వాసులు పారశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెగులర్ క్లీనింగ్ డ్రైవ్స్ చేపట్టి, ప్రజల్లో పారశుధ్యం కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతన్నారు.