BigTV English

OTT Movie : పని మనిషితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే మరొకడితో ఆ పాడు పని

OTT Movie : పని మనిషితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే మరొకడితో ఆ పాడు పని

OTT Movie : సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఒక మలయాళ మూవీలో, ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ఇది గ్రీకు పురాణ ఎలెక్ట్రా కథను పోలి ఉంటుంది. కేరళ సెట్టింగ్‌లో అద్భుతంగా ఈ స్టోరీ నడుస్తుంది. ఇందులో నయనతార, మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ మలయాళ సైకలాజికల్ డ్రామా మూవీ పేరు ‘ఎలెక్ట్రా’ (Elektra). ఈ సినిమాకి శ్యామప్రసాద్ రాజగోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతార ఎలెక్ట్రా పాత్రలో, మనీషా కొయిరాలా డయానా పాత్రలో, ప్రకాష్ రాజ్ అబ్రహం పాత్రలో, బిజు మీనన్, స్కంద అశోక్ (సూరజ్ స్కంద), శ్రుతి మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎన్.బి. వింధ్యన్ నిర్మాణంలో, ఆల్ఫోన్స్ జోసెఫ్ సంగీతం, సాను జార్జ్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, వినోద్ సుకుమారన్ ఎడిటింగ్‌తో రూపొందింది. ఈ చిత్రం గ్రీకు పురాణ ఎలెక్ట్రా కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ స్టోరీకేరళలోని ఒక అరిస్టోక్రటిక్ కుటుంబంలో జరుగుతుంది. ఈ సినిమా 7వ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఈ చిత్రం సన్ NXT, అమెజాన్ ప్రైమ్ వీడియో Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ కేరళలోని ఒక సంపన్న కుటుంబం అయిన తరవాడ్‌లో జరుగుతుంది. ఎలెక్ట్రా (నయనతార) తన తండ్రి అబ్రహం (ప్రకాష్ రాజ్) పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటుంది. అబ్రహం ఒక ధనవంతుడైన భూస్వామిగా , జఫ్నాలో తన ఎస్టేట్‌లో మహిళలతో జీవితాన్ని విలాసంగా గడుపుతాడని పుకార్లు ఉన్నాయి. ఇది అతని భార్య డయానా (మనీషా కొయిరాలా) కి మింగుడుపడకుండా ఉంటుంది. డయానా తన భర్త కుమార్తె ఎలెక్ట్రా పట్ల కోపంతో ఉంటుంది.  ఎందుకంటే ఎలెక్ట్రా తన తండ్రి పట్ల ప్రేమతో ఉండటమే ఇందుకు కారణం. ఎలెక్ట్రా సోదరుడు ఎడ్విన్ (స్కంద అశోక్), ఒక న్యూరోటిక్ వ్యక్తి. తన తల్లి డయానాతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ అతన్ని జఫ్నాకు పంపించడంలో ఎలెక్ట్రా, అబ్రహం కుట్ర పన్నినట్లు డయానా భావిస్తుంది. ఇప్పుడు ఈ కుటుంబంలోని సంబంధాలు, ప్రేమ, ఈర్ష్య, ద్వేషంతో నిండిపోతాయి.

ఇక స్టోరీ అబ్రహం ఆకస్మిక మరణంతో టర్న్ అవుతుంది. అతను జఫ్నా నుండి కేరళలోని తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణిస్తాడు. అతని మరణం చుట్టూ ఒక రహస్యం దాగి ఉంటుంది. ఇది తరవాడ్‌లో గతంలో జరిగిన అనేక మరణాలను పోలి ఉంటుంది. ఎలెక్ట్రా తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ కారణంగా తన తల్లి డయానాపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంటుంది. డయానా తన తండ్రి మరణానికి కారణమని నమ్ముతుంది. ఈ సందర్భంలో, ఎలెక్ట్రా తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది.

తన సోదరుడు ఎడ్విన్‌ను ఈ ప్రణాళికలో భాగం చేస్తుంది. ఎడ్విన్ తన తల్లి పట్ల ఉన్న అనురాగం, ఎలెక్ట్రా ప్రభావంతో తన తల్లికి వ్యతిరేకంగా తిరుగుతాడు. ఎలెక్ట్రా అతి ప్రేమ తన తండ్రి నుండి ఎడ్విన్‌కు బదిలీ అవుతుంది. ఇది కుటుంబంలో మరిన్ని ఇబ్బందులను సృష్టిస్తుంది. కథలో ఒక అధికారి (బిజు మీనన్) కూడా ఉంటాడు. అతను అబ్రహం మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. కానీ అతనికి ఎలెక్ట్రా అంటే ఇష్టం. ఇక ఎలెక్ట్రా , ఎడ్విన్ కలిసి డయానాకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పథకాన్ని రూపొందిస్తారు. ఆ ప్లాన్ ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అనేవి మూవీ చూసి తెలుసుకోండి.

Read Also : ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన బాసిల్ జోసెఫ్ మలయాళ మూవీ… కామెడీకి పొట్ట చెక్కలే

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×