BigTV English

Rupee History : అమెరికాలో ఆగిన పెన్నీ – మరి మన రూపాయి సంగతేంటి? ఒక్క నాణెం ముద్రణకు ఎంత ఖర్చంటే!

Rupee History : అమెరికాలో ఆగిన పెన్నీ – మరి మన రూపాయి సంగతేంటి? ఒక్క నాణెం ముద్రణకు ఎంత ఖర్చంటే!

Rupee History : అమెరికా ఆర్థిక వ్యవస్థలో 233 ఏళ్లుగా ఉన్న పెన్ని కాయిన్ ఇకపై ముద్రించేందుకు వీలు లేదంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. వాస్తవంలో దాని విలువ కంటే ఆ నాణేన్ని ముద్రించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుండడమే ట్రంప్ నిర్ణయానికి కారణం. అమెరికాలోని వృథా ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులు, వివిధ శాఖల్లోని దుబారా ఖర్చులపై నియంత్రణ విధిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. విదేశాలకు విడుదల చేసే నిధుల విషయంలోనూ కఠినంగానే ఉంటున్న సంగతి తెలుసు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే.. చివరికి అమెరికాలో వినియోగంలోని కరెన్సీలో అతి తక్కువ విలువైన పెన్నీ ముద్రణలోనూ పొదుపు చర్యలకు ఆదేశించి.. ఆశ్చర్య పరిచారు. మరి భారత్ లో కాయిన్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. మన దగ్గర ఎంత విలువైన డబ్బుల ముద్రణకు, ఎంత డబ్బు ఖర్చవుతుంది అంటే..


భారత్ లో రూపాయి ఎప్పటి నుంచో వాడకంలో ఉంది. చిన్న చాక్లెట్ కొనుకున్నా, అగ్గిపెట్ట కావాలన్నా.. రూపాయి బాగా ఉపయోగపడుతుంది. రూపాయి నాణెనాకి భారత మార్కెట్లో మంచి విలువ ఉంది. దేశంలో డిజిటల్ చెల్లింపులు కొత్త శిఖరాలకు చేరుతున్న తరుణంలోనూ రూపాయి నాణేన్ని వినియోగం నుంచి తీసేయాల్సిన అవసరం ఏర్పడడం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే.. మన దగ్గర ప్రస్తుతం పైసలు అందుబాటులో లేవుకానీ, చట్టబద్ధంగా వాటికి విలువ ఉంది. అమెరికాలు సెంటును సూచించేందుకు పెన్ని అంటుంటారు. అంటే.. 100 సెంట్లు అయితే ఒక డాలర్. అంటే.. డాలర్ లో వందో వంతు విలువైన పెన్నీల ఖర్చును ట్రంప్ పరిగణలోకి తీసుకున్నారు.

విలువ కంటే ఖర్చు ఎక్కువ
అమెరికాలో ఒక పెన్నీని ముద్రించేందుకు దాని వాస్తవ విలువ కంటే ఎక్కువ ఖర్చువుతుంది. అంటే ఒక పెన్నీని వినియోగంలోకీ తీసుకువచ్చేందుకు రెండు పెన్నీల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్.. ఇదంతా వృథా అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల్లో వృథా ఖర్చుల్ని కనిపెట్టి, నివారించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన డీఓజీఈ విభాగం సహా అనేక ఇతర వర్గాల నుంచి పెన్నీ నిలుపుదలకు సూచనలు వచ్చిన వేళ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పెన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో 230 ఏళ్లుగా వినియోగంలో ఉంది. అంతటి చరిత్రకు ఇప్పుడు ట్రంప్ బ్రేకులు వేశారు.


భారత్ లో రూ.1 నాణెం తయారీ ఖర్చు తెలుసా..
దేశంలో ఒక రూపాయి నాణేన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో కింద పని చేసే సెక్యూరిటీ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముద్రిస్తుంది. ఇటీవల అయితే రూపాయి నాణెం ముద్రణకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందనే వివరాలు అందుబాటులో లేవు. కానీ.. 2018లో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు భారత్ లో రూపాయి ముద్రణకు.. రూపాయి కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలిసింది.
ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఒక్క రూపాయి నాణెం ముద్రణకు, రూ.1.11 (రూపాయి 11 పైసలు) ఖర్చు అవుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో.. రూపాయి నాణెం ముద్రణ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం ఆర్బీఐ విడుదల చేస్తున్న రూపాయి కాయిన్ కోసం 3.79 గ్రాముల ఫెర్రీటిక్ స్టెయిన్ లెస్ స్టీల్ వినియోగిస్తున్నారు. అదే.. అర్థ రూపాయి కాయిన్ కోసం అయితే 2.83 గ్రాముల లోహాన్ని వినయోగించాల్సి ఉంటుంది. అయితే.. ఆర్బీఐ 2011 నుంచి అర్థ రూపాయి నాణేలను ముద్రించడం ఆపేసింది. ప్రస్తుతం మార్కెట్లో సైతం లభించడం లేదు. కానీ.. వాటిని పూర్తిగా నిర్వీర్యం మాత్రం చేయలేదు. వాటికి సైతం మార్కెట్లో విలువ ఉంది. కానీ.. ప్రజల వినియోగంలో మాత్రం దాని విలువ కారణంగా అంగీకరించడం లేదు.

ఆర్బీఐ గవర్నర్ సంతకం అవసరం లేదు
భారత్ లో రూపాయి నాణెం మాత్రమే కాదు, రూపాయి కాగితం కూడా ఉంది. అత్యాధునిక సాంకేతికత వినియోగించి రూపొందించే రూపాయి విలువైన కాగితం తయారీకి ముద్రణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయనే కారణంగా.. 1994లోనే ప్రభుత్వం ముద్రణ నిలిపివేసింది. కానీ.. 2017లో తిరిగి వినియోగంలోకి వచ్చింది. అయితే.. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. దేశంలో చలామణిలో ఉంటే నోట్లపై అవి ముద్రితమైయ్యే నాటి ఆర్బీఐ గవర్నర్ సంతకం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. లేదంటే వాటికి చట్టబద్ధత ఉండదు. కానీ.. రూపాయి నాణెం, నోట్లను కేంద్ర ప్రభుత్వమే నేరుగా జారీ చేస్తుంది. అందుకే.. ఈ నోట్లపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం సరిపోతుంది.

ప్రస్తుతం భారత్ మార్కెట్లో అత్యంత తక్కువ విలువైన నాణెం అంటే.. రూపాయి. దీని ముద్రణ ఖర్చులు పెరుగుతుండడంతో క్రమంగా ఆర్బీఐ రూపాయి ముద్రణను తగ్గిస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 నాటి సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం.. అంతకు క్రితం 903 మిలియన్ల కాయిన్ల (రూ.93 కోట్లు) నుంచి కేవలం 630 మిలియన్ల (63 కోట్ల) నాణేలను మాత్రమే ముద్రించింది.  అయితే.. రూపాయి కొనసాగింపుతో ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న లావాదేవీలకు ఇబ్బంది లేకుండా, ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ రూపాయి లావాదేవీలు.. ఆన్ లైన్ వినియోగం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగానే జరుగుతున్నాయి. మొత్తంగా ముద్రణ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ రూపాయి ముద్రణను మాత్రం అమెరికా లాగా ఆపేయలేని పరిస్థితి మనది.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×