BigTV English

Bank Negative Balance: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

Bank Negative Balance: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

Bank Negative Balance| బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఉండే ప్రతి ఒక్కరికీ మినిమమ్ బ్యాలెన్స్ (కనీస మొత్తం) ఉండాలని బ్యాంకులు హెచ్చరిస్తుంటాయి. అంటే అకౌంట్ లో కొంత కనీస మొత్తం ఉంచాలి. లేకపోతే బ్యాంక్ మీకు ఫైన్ విధిస్తుంది. ఈ కారణంగా అకౌంట్ లో ఉండే డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా జీరో నుంచి నెగిటివ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ తరువాత మీరు ఎప్పుడైనా ఆ అకౌంట్ లో డబ్బులు వేశారా.. ఇక అంతే సంగతులు. ఆ వేసిన డబ్బులలో నుంచి బ్యాంకు ఫైన్ కట్ చేసుకుంటుంది. ఈ అనుభవం మీలో చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది.


నెగెటివ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే మీ అకౌంట్ లో వేసిన డబ్బులు పోను మీరే ఇంకా బ్యాంకుకు డబ్బులు చెల్లించాల్సి ఉందని రివర్స్ గా బ్యాంక్ అధికారులు వాదిస్తారు. సురేష్ అనే వ్యక్తికి ఒక జాతీయ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. గత ఆరు నెలలుగా అతను అకౌంట్ ఉపయోగించలేదు. అందులో పెద్దగా డబ్బులు కూడా లేవు. కానీ రెండు రోజుల క్రితమే అతని అకౌంట్ లో అతని స్నేహితుడు డబ్బులు వేశాడు. కానీ సురేష్ చెక్ చేస్తే.. డబ్బులు లేవు. ఇదేంటని సురేష్ బ్యాంకు అధికారులను అడిగితే.. వారిచ్చిన సమాధానం విని సురేష్ తల పట్టుకున్నాడు.

Also Read: Ticket Deposit Receipt| ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!


సురేష్ గత ఆరు నెలలుగా బ్యాంక్ అకౌంట్ ని ఉపయోగించలేదు. అతని అకౌంట్ లో అసలు డబ్బులు లేవు. అంటే బ్యాంక్ నియమాల ప్రకారం.. మినిమమ్ బ్యాలెన్స్ అతను ఉంచలేదు. దీంతో బ్యాంక్ అతని అకౌంట్ లో ఫైన్ విధిస్తూ ఉంది. అంటే అకౌంట్ బ్యాలెన్ స్ జోరో కంటే తక్కువ మైనస్ అయిపోయింది. సురేష్ స్నేహితుడు డబ్బులు వేయగానే ఆ డబ్బులన్నీ బ్యాంక్ కట్ చేసుకుంది. ఇదంతా విని సురేష్ తనకు అకౌంట్ అవసరం లేదని వెంటనే అకౌంట్ క్లోజ్ చేయాలని అధికారులను అడిగితే.. అలా కుదరదని ముందు మిగతా ఫైన్ కట్టాలని ఆ తరువాత అకౌంట్ క్లోజ్ చేస్తామని చెప్పారు.

మీరు కూడా ఇలాంటి సమస్యని ఎదుర్కొనే ఉంటారు. కానీ దీనికి ఓ పరిష్కారం ఉంది. నిజానికి బ్యాంకులన్నీ ఖాతాదారులు రూ.500 లేదా రూ.1000 మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయాలని చెబుతాయి. అలా చేయని ఖాతాదారులపై ఫైన్ విధించే అధికారం బ్యాంకులకు ఉంది. కానీ ఆ అధికారానికి కూడా హద్దులున్నాయి. రిజర్వ బ్యాక్ ఆఫ్ ఇండియా 2014-15 నియమాల ప్రకారం.. మినిమమ్ బ్యాలెన్స్ పెట్టని అకౌంట్స్ లో బ్యాంక్ ఫైన్ విధించవచ్చు కానీ అలా చేసేముందు కస్టమర్ కు ఫైన్ విధిస్తున్నట్లు సమాచారం ఇవ్వాలి. ఆ తరువాత అకౌంట్ లో బ్యాలెన్స్ జోరో అయ్యేంత వరకే ఫైన్ విధించాలి. జోరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై అంతకంటే ఎక్కువ ఫైన్ విధించకూడదు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

ఈ నియమం స్పష్టంగా ఉన్నా.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్స్ ముక్కుపిండి ఫైన్ మీ ఫైన్ వసూలు చేస్తున్నాయి. అలా చేయడం నియమాలకు విరుద్ధం. ఇకపై బ్యాంకులు అలా చేస్తే.. మీరు బ్యాంకు మెనేజర్ తో వెళ్లి మీ అకౌంట్ నెగిటివ్ బ్యాలెన్స్ చేయకూడదని కట్ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగండి. అలా చేయకపోతే.. రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ వరకు మాత్రమే బ్యాంకుకు ఫైన్ విధించే అధికారం ఉంది. ఆ బ్యాలెన్స్ ని నెగిటివ్ చేసే అధికారం బ్యాంకుకు లేదు. ఫైన్ విధించే ప్రతీసారి బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి. అలా చేయపోతే మీరు ఫిర్యాదు చేసే అధికారం ఉంది. డబ్బులెవరకీ ఊరికే రావు. చివరగా ఒక మాట.. బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకపోతే దానిని వీలైన త్వరగా క్లోజ్ చేయడం ఉత్తమం.

 

Related News

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Karnataka Library: ఆస్తులు అమ్మి పుస్తకాలు కొన్నాడు.. అసలు ట్విస్ట్ ఇదే!

Red Fort theft: ఎర్రకోటలో సంచలనం.. బంగారు, వజ్ర కలశాలు గల్లంతు.. విలువ కోట్లల్లోనే!

Samajwadi Leader: పరుపు చాటున దాక్కున్న నాయకుడు.. బెడ్ రూమ్ నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

Modi – Trump: దెబ్బకు దెయ్యం దిగింది.. స్వరం మార్చిన ట్రంప్ – అభినందించిన మోదీ

Indigo Flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 180 మందికి పైగా ప్రయాణికులు

Big Stories

×