BigTV English

One Nation – One Election : కేంద్రం కీలక నిర్ణయం.. అలర్ట్ అయిన ప్రతిపక్ష పార్టీలు.. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు

One Nation – One Election : కేంద్రం కీలక నిర్ణయం.. అలర్ట్ అయిన ప్రతిపక్ష పార్టీలు.. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు

One Nation – One Election : కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటైన జమిలి ఎన్నికలపై కీలక ముందడుగు పడింది. చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆముదముద్ర వేసింది. దీంతో ఈ ముసాయిదా బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నిక నిర్వహించే జమిలీ పద్ధతి అమలు చేయాలని అధికార భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుంటోంది. కానీ.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు జమిలీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయ. జమిలీ ద్వారా ఎన్నికల ఖర్చు, సిబ్బంది వినియోగం, పథకాలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు ఉండవనేది.. అధికార పార్టీ ఆలోచనలుగా చెబుతోంది. అయితే.. జమిలీ ద్వారా అధికారాన్ని కేంద్రీకరించడం, ఏకస్వామ్య విధానానికి మార్చడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వంటి అనేక అనుమానాలన్నాయంటూ కాంగ్రెస్ మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమిలికి సంబంధించి కీలక నిర్ణయం జరిగిపోవడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే డిసెంబర్ 13, 14వ తేదీల్లో తమ ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ – బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. దీంతో జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లు సభలో చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు. ఒకవేళ సభ ముందుకు ముసాయిదా బిల్లు చర్చకు వస్తే సభలో ఎలాంటి చర్చ జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, జమిలి ఎన్నిక నిర్వహణకు అనుసరించాల్సిన విధి విధానాలతో పాటు రాజ్యాంగంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులు వంటి అంశాలను పరిశీలించేందుకు కేంద్రం భారీ కసరత్తే చేసింది. ఈ విషయాలకు సంబంధించిన న్యాయ అంశాలను సమీక్షించి, జమిలి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సిఫార్సులు చేసేందుకు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ న్యాయవాది రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Also Read : తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. 12 మంది నక్సల్స్ మృతి

అనేక అంశాలపై కసరత్తు చేసిన ఈ కమిటీ.. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు తమ సిపార్సుల్ని తెలియజేసింది. ఇప్పుడు ఈ సిఫారసులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంతో ఇక తదుపరి పార్లమెంట్ వేదికగా జమిలి ఎన్నికలకు సంబంధించి విధివిధానాల రూపకల్పన, బిల్లు ఆమోదంపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ దాన్ని మిత్రపక్షాలన 30కి పైగా పార్టీలు అనుకూలంగా ఉంటుండగా కాంగ్రెస్ పార్టీ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

బీజీపీ ఆలోచించాల్సింది వీటి గురించి కాదు

కేంద్రంలోని బీజేపీ విధానాలపై మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చే దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్… ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి.. ఒక దేశం – ఒకే విద్య విధానం ఉండాలి. మన దేశానికి.. ఒక దేశం- ఒక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉండాలి. ఇవి ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ.. దేశానికి ఏ తీరుగా చూసినా.. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం అవసరం లేదు. బీజేపీ ప్రాధాన్యతలు తప్పాయంటూ కామెంట్ చేశారు.

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×