BigTV English

Hospitals Security: ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం భద్రత పెంపు.. కేంద్రం కీలక ఆదేశాలు..

Hospitals Security: ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం భద్రత పెంపు.. కేంద్రం కీలక ఆదేశాలు..

Hospitals Security| కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం సెక్యూరిటీ పెంచాలని సోమవారం ఆగస్టు 19న ఆదేశించింది. ఆస్పత్రుల వద్ద అవసరాన్ని బట్టి మార్షల్స్ ని కూడా పెంచాలని సూచించింది. డాక్టర్లకు అదనపు రక్షన కల్పించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టర్ జెనెరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ అపూర్వ చంద్ర తెలిపారు.


డాక్టర్లకు రెస్ట్ రూమ్స్ లాంటి కనీస అవసరాలు, సిసిటీవి సౌకర్యాలు లాంటి సమస్యలను పరిష్కరించాలని, ఆస్పత్రిలో హింసాత్మక ఘటనలు జరిగిన వేళ ఆరు గంటలలోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర హెల్త్ సెక్రటరీ అపూర్వ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని 26 రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం ఇప్పటికే చట్టాలు ఉన్నాయని, అయినా భద్రత దృష్ట్యా అవసరమైన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ సిబ్బందిని 25 శాతం వరకు పెంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వీటికి తోడు రక్షణ కోసం అదనంగా అవసరాన్ని బట్టి మార్షల్స్ ని కూడా పెంచాలిన చెప్పారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..


డాక్టర్ల సమస్యలు పరిష్కిరించడానికి, సిసిటీవి ఏర్పాట్లు చేయడానికి ప్రతి ఆస్పత్రిలో ఒక డ్యూటీ రూం ఏర్పాటు చేస్తామని.. ఏదైనా హింసాత్మక ఘటన జరిగితే.. ఆరు గంటలలోపు, లేదా బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కోల్ కతాలో జరిగిన మహిళా డాక్టర్ హత్యాచారం కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Also Read: ముడా స్కాంలో హైకోర్టు కీలక తీర్పు.. సిఎం సిద్దరామయ్యకు ఊరట!

మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండడంతో అన్ని ఆస్పత్రల్లో ఓపిడి వైద్య సేవలు అంతరాయం కలుగుతోంది. ”ఒక మహిళా డాక్టర్ 36 గంటలపాటు విరామం లేకుండా డ్యూటీ చేస్తే.. ఆమెను పైశాచికంగా హత్య చేశారు. ఘటన జరిగి 11 రోజులైంది. కానీ ఇంతవరకు న్యాయం అందలేదు. మా సోదరికి న్యాయం జరగాలనే మేం పోరాడుతున్నాం” అని నిరసన చేస్తున్న ఒక డాక్టర్ ఆవేశంగా మీడియాతో మాట్లాడారు.

Also Read: 13 ఏళ్లుగా భార్య కోసం గాలింపు.. అతడి ఎదురుచూపు వెనుక అంతుచిక్కని విషాదం

జూనియర్ డాక్టర్లు సమ్మె కారణంగా విధుల్లో రాకపోవడంతో సీనియర్ డాక్టర్లు ఓపిడి సేవలందిస్తున్నారు. ఈ కారణంగా సోమవారం అన్ని ఆస్పత్రుల్లో ఓపిడి పేషంట్స్ భారీగా క్యూకట్టారు.

Also Read: ‘మా ఆవిడ నన్ను కొడుతోంది.. నేను జైల్లో ఉంటా?’.. ఇంటి నుంచి పారిపోయిన భర్త!

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×