E-Paper
Advertisement

షార్క్-పిచ్చి సీరియల్ కిల్లర్… టూరిస్టులను కిడ్నాప్ చేసి బలిచ్చే అరాచకం

షార్క్-పిచ్చి సీరియల్ కిల్లర్… టూరిస్టులను కిడ్నాప్ చేసి బలిచ్చే అరాచకం
Advertisement

Hollywood Horror Movie: ఇప్పటిదాకా మనం చూసిన సినిమాల ప్రకారం… ఒక్కో సైకోకి ఒక్కో పిచ్చి ఉంటుంది. చంపడం మాత్రం కామన్ అనుకోండి. కాకపోతే చంపే విధానాలు, అందుకు గల కారణాలు డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో సైకో మాత్రం విచిత్రంగా ఉంటాడు. ఇలాంటి సైకోని ఇప్పటిదాకా కనీవినీ ఎరుగరు. ఎందుకంటే ఈ కిల్లర్ కు షార్క్ ల పిచ్చి ఉంటుంది. వాటికోసం ఏకంగా మనుషుల్ని చంపేస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన మూవీనే ‘డేంజరస్ యానిమల్స్’ (Dangerous Animals). 2025లో వచ్చిన ఈ అమెరికన్ – ఆస్ట్రేలియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ సముద్రతీర నేపథ్యంలో కథ సాగుతుంది. టక్కర్ అనే బోట్ కెప్టెన్ పర్యాటకుల కోసం ‘షార్క్ కేజ్ డైవింగ్’ ఎక్స్‌పీరియన్స్‌ ను నిర్వహిస్తుంటాడు. చిన్నప్పుడు ఒక షార్క్ దాడి నుండి ప్రాణాలతో బయట పడిన టక్కర్ మనసు నెమ్మదిగా వికృతంగా మారిపోతుంది. అతను సొరచేపలను దైవంగా భావించి, వాటికి మనుషులను బలి ఇవ్వడాన్ని ఒక ఆచారంగా చేసుకుంటాడు.

Advertisement

ఈ క్రమంలోనే ఒకరోజు గ్రెగ్, హీథర్ అనే ఇద్దరు యంగ్ టూరిస్టులు అతని బోటులో ప్రయాణిస్తారు. టక్కర్ గ్రెగ్‌ ను చంపి, హీథర్‌ ను కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో అమెరికన్ అమ్మాయి జెఫిర్ సముద్ర తీరంలో సర్ఫింగ్ చేస్తూ ఉంటుంది. ఆమెకు స్థానిక సర్ఫర్ మోసెస్‌ తో పరిచయం ఉంటుంది. ఓ రాత్రి ఒంటరిగా సర్ఫింగ్ చేస్తున్న జెఫిర్ టక్కర్ కంటపడుతుంది. ఇంకేముంది ఆ అమ్మాయిని కూడా బందిస్తాడు.

టక్కర్ జెఫిర్‌ను హీథర్‌తో పాటు బోటులోని రహస్య గదిలో గొలుసులతో బంధిస్తాడు. ప్రతి రాత్రి అతను సముద్రంలో రక్తాన్ని చల్లి ఆకలితో ఉన్న షార్క్‌లను ఆకర్షిస్తాడు. ఆ తర్వాత బంధీలను హార్నెస్ సహాయంతో గాల్లోకి లేపి, కింద షార్క్‌ లు వారిని కొరుకుతుంటే ఆ భయంకరమైన దృశ్యాలను తన పాత VHS కెమెరాలో రికార్డ్ చేసి ఆనందిస్తాడు. ఈ నేపథ్యంలోనే జెఫిర్, హీథర్ ప్రాణాలు కాపాడుకోవడానికి తమ తెలివితేటలను ఉపయోగించి, తమను కట్టేసిన గొలుసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

Advertisement

మరోవైపు మోసెస్ జెఫిర్ కనిపించకపోవడంతో ఆమె కోసం వెతకడం మొదలు పెడతాడు. జెఫిర్ ఒక్కటే కాకుండా హీథర్‌ను కూడా కాపాడాల్సి వస్తుంది మోసెస్. బోటు చుట్టూ ఆకలితో వలయంల మారిన ఆ భయంకర సొరచేపలు ఓవైపు, సైకో కిల్లర్ టక్కర్ మరోవైపు. ఈ ప్రమాదాల నుండి జెఫిర్ ఎలా ప్రాణాలతో బయటపడింది ? ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? ఆమె బాయ్ ఫ్రెండ్ బతికి బయట పడ్డాడా ? లేదా ఆ కిల్లర్ కు బలయ్యాడా ? అనేది తెలియాలంటే ఈ సర్వైవల్ థ్రిల్లర్ లో చూసి తెలుసుకోవలసిన అంశం.

తెలుగులో స్ట్రీమింగ్

సీన్ బైర్న్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డేంజరస్ యానిమల్స్’ సినిమాలో హాసీ హారిసన్, జై కోర్ట్‌నీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం Amazon Prime Video, JioCinemaలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Read Also: హెడ్ మాస్టర్ కూతురితో ప్రేమాయణం… మళ్లీ మళ్ళీ చూడాలన్పించే తెలుగు సిరీస్

Related News

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మూకుత్తి అమ్మన్ 2.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

Big Stories

Advertisement
×