E-Paper
Advertisement

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు
Advertisement

Telugu Emotional Drama: బ్రేకప్ తర్వాత మనసు ప్రశాంతంగా ఉండాలని ఒంటరిగా ఓ ప్రయాణం మొదలు పెడితే… అక్కడే మాజీ ప్రేమికురాలు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఒకరిని ఒకరు చూడటానికే ఇష్టపడని ఇద్దరూ… తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి ప్రయాణించాల్సి వస్తే పాత జ్ఞాపకాలు మళ్లీ వెంటాడతాయా ? అసలు వాళ్ల మధ్య బ్రేకప్‌ కు కారణమేంటి ? ఇంకా మనసులో ప్రేమ మిగిలే ఉందా ? ఇలాంటి ప్రశ్నల చుట్టూ తిరిగే లవ్ అండ్ హార్ట్‌బ్రేక్ డ్రామానే ‘కొలవరి’ (Kolaveri). మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

విక్రమ్ జీవితంలో ప్రేమకు అనుకోని బ్రేక్ పడుతుంది. ప్రియురాలితో విడిపోయిన బాధ నుంచి బయట పడేందుకు, గతాన్ని పూర్తిగా మర్చిపోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకే ఎవరూ లేని ప్రశాంతమైన ప్రదేశానికి హైకింగ్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. కొత్త ప్రయాణంతో తన పాత జ్ఞాపకాలకు ముగింపు పలకాలని భావిస్తాడు. అయితే విక్రమ్ ఊహించినట్టుగా ఆ ప్రయాణం సాగదు. తాను దూరంగా పారిపోవాలనుకున్న వ్యక్తే అక్కడ ప్రత్యక్షమవుతుంది. అతని మాజీ ప్రేయసి శ్రావ్య కూడా అదే హైకింగ్ ట్రైల్‌ లోకి వస్తుంది.

Advertisement

ఒకప్పుడు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూడటానికే ఇష్టపడరు. కానీ ప్రయాణ పరిస్థితులు వారిని మళ్లీ కలిసి నడిచేలా చేస్తాయి. అలా మొదలైన ఆ ప్రయాణంలో మాటల కంటే జ్ఞాపకాలే ఎక్కువగా మాట్లాడతాయి. గతంలో జరిగిన గొడవలు, చిన్న చిన్న అపార్థాలు, ఒకరిపై ఒకరికి ఉన్న బాధ… ఒక్కొక్కటిగా బయట పడతాయి. విడిపోవడానికి అసలు కారణమేంటో ఇద్దరికీ మళ్లీ గుర్తొస్తుంది. తాము ఒకరినొకరు నిజంగా ద్వేషిస్తున్నామా… లేక బాధలో అలా నటిస్తున్నామా అనే ప్రశ్న కూడా వాళ్ల ముందుకొస్తుంది.

ఎంత దూరంగా వెళ్లినా కొన్ని జ్ఞాపకాలు మన వెంటనే వస్తాయని ఈ ప్రయాణం వాళ్లకు అర్థమవుతుంది. చివరికి విక్రమ్, శ్రావ్యల మధ్య మిగిలిన ప్రేమ ఈ ప్రయాణంతో బయట పడుతుందా ? వాళ్లు మళ్లీ ఒక్కటవుతారా ? లేక ఈ ప్రయాణం వారి ప్రేమకథకు శాశ్వత ముగింపు పలుకుతుందా ? అనేదే ‘కొలవరి’లో చూడాల్సిన కథ.

తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

‘కొలవరి’ సెప్టెంబర్ 11 నుంచి ETV Winలో నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. Win Mini Originalsలో భాగంగా వచ్చిన ఈ తెలుగు లవ్ అండ్ హార్ట్‌బ్రేక్ డ్రామా… యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ప్రేమ, బ్రేకప్, అపార్థాలు, పాత జ్ఞాపకాల నేపథ్యంలో సాగుతుంది. లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవాళ్లు ఈ వీకెండ్‌లో ‘కొలవరి’ని ఓసారి ట్రై చేయొచ్చు. కృష్ణ పూజిత దర్శకత్వం వహించిన ఈ మినీ మూవీలో రవితేజ ముక్కామల్లి విక్రమ్‌గా, శ్రావ్య సామల శ్రావ్యగా నటించారు. అభినయ్ టి.జె సంగీతం అందించగా, పృథ్వీరాజ్ నరహరి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Read Also: డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

Tags

Related News

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

కుటుంబ బంధాలను సైతం బలితీసుకునే పొలిటికల్ యాక్షన్ డ్రామా… విశాల్ గ్యాంగ్ స్టర్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

ఏళ్లుగా క్రికెట్ రైవల్రీ… గేమ్ కోసం మొదలైన గొడవ కుల వివక్షపై పోరుగా మారితే… ఓటీటీలో సూపర్ స్పోర్ట్స్ డ్రామా

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×