Agra Murder: ఉత్తర్ ప్రదేశ్ లో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ.. భర్తను చంపి బాత్రూమ్ కింద సమాధి చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. హత్య చేయడమే కాకుండా.. తన భర్త కనిపించడం లేదంటూ నేరుగా పోలీసులనే ఆశ్రయించింది. దీంతో 45 రోజుల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరిగా ఇంటి ఆవరణలోని బాత్రూమ్ లోనే భర్త శవాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
యూపీలోని ఆగ్రాకి చెందిన రూబీ, సురేంద్ర శర్మ భార్య భర్తలు. కొద్ది రోజుల క్రితం సురేంద్ర అనూహ్యంగా కనిపించకుండా పోయాడు. దీంతో భార్యతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భర్త ఆచూకీ కోసం 45 రోజులుగా విస్తృతంగా ప్రయత్నించినప్పటికీ సురేంద్ర జాడ పోలీసులకు కనిపించలేదు. దీనికితోడు తన భర్త కోసం రూబీ.. విలవిలలాడిపోవడం, చుట్టు పక్కల వారి దగ్గర కన్నీరు పెట్టుకుంటూ ఉండటంతో పోలీసుల దృష్టి ఆమె మీదకు వెళ్లలేదు.
అయితే అనూహ్యంగా సురేంద్ర సోదరుడికి రూబీపై అనుమానం వచ్చింది. తన అన్నను రూబీనే ఏదో చేసి ఉండొచ్చని అతడు పోలీసుల వద్ద పేర్కొన్నాడు. దీనికి తోడు భర్త మిస్సింగ్ గురించి చుట్టుపక్కల వారితో రూబీ చెప్పిన స్టోరీ.. పొంతన లేకుండా ఉండటంతో పోలీసుల దృష్టి కూడా ఆమె మీదకు మళ్లింది. దీంతో రూబీని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. తొలుత తనకు ఏమి తెలియదని మెుండికేసినప్పటికీ.. చివరికి నేరాన్ని అంగీకరించింది.
Also Read: నిన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. స్వామి వారి కానుకలు మాయం?
తన భర్తను ఎలా చంపానన్న విషయాన్ని కూడా పోలీసుల విచారణలో రూబీ వెల్లడించింది. తొలుత నిద్రమాత్రలు కలిపిన పాయసాన్ని సురేంద్రకు ఇచ్చినట్లు తెలిపింది. అతడు మత్తులోకి జారుకోవడంతో ముఖంపై దిండు పెట్టి ఊహిరాడకుండా చేసిన్నట్లు పేర్కొంది. చివరికి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బాత్రూమ్ లో గుంత తవ్వి పాతిపెట్టినట్లు వివరించింది. దీంతో పోలీసులు బాత్రూమ్ ఫ్లోర్ ను తవ్వి.. సురేంద్ర మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
Also Read: ఉక్కు పరిశ్రమ జగన్ పుణ్యమే.. చంద్రబాబుది ‘క్రెడిట్ డ్రామా’.. ఎంపీ అవినాష్ ఫైర్