Big Stories

UPSC Results : UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

UPSC Results Released : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆదిత్య శ్రీ వాత్సవకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రదాన్ కు రెండో ర్యాంక్, దోనూరు అనన్యారెడ్డికి మూడవ ర్యాంక్ వచ్చింది. పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ కు నాల్గవ ర్యాంక్, రుహానీకి ఐదవ ర్యాంక్ వచ్చింది.

- Advertisement -

1016 మంది ఉత్తీర్ణులు అవ్వగా.. 347 మందిని జనరల్ కేటగిరీలో, 303 మందిని ఓబీసీ కేటగిరీలో, 165 మందిని ఎస్సీ కేటగిరీలో, 86 మందిని ఎస్టీ కేటగిరీలో ఎంపిక చేశారు. అభ్యర్థులు ఫలితాలను upsc.gov.in, upsconline.nic.in లో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష 2023 మే 28న నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023 సెప్టెంబర్ లో 15,16,17,23,24 తేదీల్లో జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్ 8న వీటి ఫలితాలు రాగా.. ఉత్తీర్ణులైన అభ్యర్థులను జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 మధ్య దశలవారీగా ఇంటర్వ్యూలు చేసింది యూపీఎస్సీ బోర్డు.

తాజాగా ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయినవారి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఐపీఎస్ కు200, ఐఏఎస్ కు 180, ఐఎఫ్ఎస్ కు 37 మంది ఎంపికయ్యారు. వీరిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ విభాగాలతో పాటు.. ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తుంది.

 

 

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News