BigTV English

Notification from UPSC: యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. వెంటనే అప్లై చేసేయండి.. పరీక్ష ఎప్పుడంటే..?

Notification from UPSC: యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. వెంటనే అప్లై చేసేయండి.. పరీక్ష ఎప్పుడంటే..?

Notification from UPSC 2024: నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు భారత ప్రభుత్వ ఎకనామిక్స్‌, స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైమ్ స్కేల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(IES) -18 పోస్టులు, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ISS) 2024-30 పోస్టులు మొత్తం 48 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(IES) -18 పోస్టులు, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌(ISS)- 30 పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఎకనామిక్‌ సర్వీసుకు పీజీ డిగ్రీ (ఎకనామిక్స్‌/ అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌)లో ఉత్తీర్ణీత సాధించి ఉండాలి. అలాగే స్టాటిస్టికల్‌ సర్వీసుకు డిగ్రీ(స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌) లేదా పీజీ(స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌)లో ఉత్తీర్ణీత సాధించింది ఉండాలి.

  • 01.08.2024 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

Also Read: 3,712 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి!


  • మొత్తం 1000 మార్కులకు ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్ విభాగాలకు వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
  • హైదరాబాద్‌, బెంగళూరు, చండీగఢ్, అహ్మదాబాద్, భోపాల్, కటక్, చెన్నై, ఢిల్లీ, జైపూర్, డిస్పూర్, జమ్మూ, లక్నో, కోల్‌కతా, ముంబై, ప్రయాగ్‌రాజ్, పాట్నా, సిమ్లా, షిల్లాంగ్, తిరువనంతపురంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే వాటి సవరణ కోసం మే 7లోపు అవకాశం కల్పించారు.
  • ఈ పోస్టులకు రాత పరీక్ష జూన్ 21గా నిర్ణయించారు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags

Related News

Delhi News: షాకింగ్.. ఢిల్లీలోని ఆ మూడు షాపింగ్ మాల్స్ మూసివేత.. నెక్ట్స్ హైదరాబాద్?

Karur Stampede: టీవీకే పంతం నెగ్గింది.. కరూర్‌ తొక్కిసలాట ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం

Bihar News: బతికుండగానే చితిపైకి పెద్దాయన.. అంతా కళ్లతో చూశాడు, అసలు మేటరేంటి?

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Big Stories

×