BigTV English

Update on Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్..!

Update on Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడిని పట్టించిన క్యాప్..!

Rameshwaram Cafe Blast Suspects Arrest: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి మతీన్ తాహాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అర్సెట్ చేసింది. రామేశ్వరంలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఇద్దరూ అస్సాం, పశ్చిమబెంగాల్ లో దాక్కున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. నిందితులను ఒక క్యాప్ పట్టించింది.


Also Read : యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్.. వెంటనే అప్లై చేసేయండి.. పరీక్ష ఎప్పుడంటే?

నిందితులు క్యాప్ కొనేందుకు ఒక షాప్ కు వెళ్లగా.. అక్కడి సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని గుర్తించారు. తరచూ సిమ్ కార్డులను మార్చుతూ.. పోలీసులకు దొరక్కుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినా.. రాడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు.. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి ఫారెస్ట్ విభాగంలో కొందరికి ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది.


కాగా.. ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరులో జరిగిన బాంబు పేలుడులో 9 మంది గాయపడ్డారు. నిందితుడు ఇడ్లీ తిని.. తన చేతిలోని బాంబు బ్యాగ్ ను అక్కడే వదిలి వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. ఆ సమయంలో నిందితుడు టోపీ ధరించి ఉన్నాడు. ఆ టోపీ ఆధారంగా దర్యాప్తు చేసిన బృందాలు.. అతను కొనుగోలు చేసినప్పటి దృశ్యాలను కనుగొన్నారు. వాటి ఆధారంగానే నిందితులను అరెస్ట్ చేశారు.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×