24 frames official announcement : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో కన్నప్ప ఒకటి. మంచు ఫ్యామిలీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రతి ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించడమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఒక ప్రభాస్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా మారిపోయాడు. ఇక కన్నప్ప సినిమాలో రుద్ర అనే పాత్ర ఎలా ఉండబోతుందో అని చాలామంది ప్రభాస్ అభిమానులకు ఒక క్యూరియాసిటీ ఉంది. అందుకోసమే వాళ్లు కూడా కన్నప్ప సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
హార్డ్ డిస్క్ మాయం
ఈరోజు పొద్దున్నుంచి కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగలించబడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు అధికారకు ప్రకటన దీని గురించి రాలేదు అనుకునే తరుణంలో 24 ఫ్రేమ్స్ దీని గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ హార్డ్ డిస్క్ దాదాపు నాలుగు వారాల కింద పోయింది అని సమాచారం వినిపిస్తుంది. అయితే అప్పుడే దీని గురించి కంప్లైంట్ కూడా చేశారు. కానీ ఈ విషయం ఈరోజు వరకు బయటపడలేదు. అయితే ఉన్నపలంగా ఈ విషయం ఇప్పుడు బయటపడడానికి కారణం ఈ సినిమాకు సంబంధించి దాదాపు 90 నిమిషాల ఫుటేజ్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్లు 24 ఫ్రేమ్స్ కి నిఘా వర్గాల నుంచి సమాచారం వెళ్ళింది. దీనితో చిత్ర యూనిట్ అలర్ట్ అయిపోయి సైబర్ క్రైమ్ ను ఆశ్రయించే ప్రయత్నం చేసింది. అందుకే ఉన్నఫలంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వార్తలు రావడం మొదలయింది.
ఎవరు మాయం చేశారు.?
ఈ హార్డ్ డిస్క్ ముంబై నుంచి 24 ఫ్రేమ్స్ ఆఫీసుకు రావాల్సి ఉంది. అయితే చరిత అని ఒక మహిళ చెప్పడంతో రఘు అనే ఒక వ్యక్తి ఈ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వీరిద్దరూ కూడా 24 ఫ్రేమ్స్ లోని పనిచేసే ఉద్యోగులు. వీరిద్దరి వ్యక్తులు వెనక ఎవరున్నారు తమకు పూర్తిగా తెలుసు అని వాళ్ళ పేర్లు కూడా త్వరలో బయటపెడతామని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకి సంబంధించిన పైరసీ కంటెంట్ బయటకు వస్తే దయచేసి దానిని ఎంకరేజ్ చేయవద్దు అంటూ ఆడియన్స్ కి పిలుపునిచ్చారు చిత్ర యూనిట్. ఈ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి వస్తున్న సమయంలో దీనిని అడ్డగించి దొంగతనం చేశారు. అయితే పోలీసులు ఈ కేస్ ఛేదించి ఏ విధంగా ఈ చిత్ర యూనిట్ కు సహాయపడతారని వేచి చూడాలి.
Also Read : జనసేన వాళ్లు ఉన్న విడిచి పెట్టాం… తిక్క లేచింది, అందరి లెక్కలు తేల్చే పనిలో పడ్డాడు