Nagpur Violence : నాగ్‌పూర్ లో చెలరేగిన హింసాకాండలో కీలక నిందితుడైన ఫాహిమ్ ఖాన్ కు చెందిన అక్రమ ఇంటిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. రెండంతస్తుల ఇంటికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించారని చెబుతూ.. నాగ్ పూర్ మున్సిపల్ శాఖ అధికారులు బుల్డోజర్లతో ఇంటిని నేలమట్టం చేశారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ వర్గం వారిని శుక్రవారం ప్రార్థనల అనంతరం షాహిమ్ ఖాన్ రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు. దీంతో.. వందల మంది మూక నాగ్ పూర్ లో తీవ్ర అలజడులు సృష్టించారు. హిందూ ప్రార్థనా స్థలాలు, వ్యక్తుల ఆస్తులే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీసులతోనూ అసభ్యకరంగా ప్రవర్తిన అల్లరి మూక.. రాష్ట్రంలో పెద్ద ఎత్తు దాడులు, ఆందోళనలు చేసేందుకు కుట్రలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్నికి కీలక సూత్రధారిగా ఉన్న షాహిమ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం దేశ ద్రోహం కేసు నమోదు చేసింది.
అతని ఆస్తులపై నాగ్ పూర్ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వారు ఉంటున్న సొంతింటిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించారని గుర్తించిన ఆధికారులు.. తొలుత నోటీసులు జారీ చేశారు. యజమానుల నుంచి ఎలాంటి వివరణలు లేకపోవడంతో.. సోమవారం ఉదయం బుల్డోజర్లతో రంగంలోకి దిగి, ఇంటిని నేలమట్టం చేశారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మూడు జేసీబీలు సంజయ్ బాగ్ కాలనీలో ఉన్న ఇంటి కూల్చివేత పనులు ప్రారంభిచాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంటి చుట్టు పక్కల ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఉంచారు.
ఖాన్ తల్లి పేరు మీద రిజిస్టర్ చేసిన ఆ ఇల్లు.. నాగ్‌పూర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ (లీజు) ప్లాట్‌లో ఉంది. దీని లీజు 2020లో ముగిసిందని నాగ్ పూర్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం, ఖాన్ కు NMC నోటీసు జారీ చేసింది, అందులో వివిధ లోపాలు, భవన ప్రణాళికఆమోదం లేకపోవడం వంటివి ఉన్నాయి.
ఫహీమ్ ఖాన్ ఎవరు?
నాగ్ పూర్ అల్లర్లకు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫహీమ్ ఖాన్.. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ (MDP) నాయకుడిగా ఉన్నాడు. అతని చర్యలతో మహారాష్ట్రలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తగా.. ఇతనిపై దేశద్రోహం కేసు నమోదైంది. మార్చి 17న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగిన హింసకు సంబంధించి అరెస్టయిన 100 మందికి పైగా వ్యక్తులలో ఆయనే ప్రధాన వ్యక్తిగా ఉన్నారు.
ఇటీవల విడుదల అయిన ఛావా సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ ను హింసిస్తూ, చంపేసిన విషయాన్ని వివరించారు. దీంతో.. ఛత్రపతి శివాజీ, శంభాజీలను ఆరాధించే మహారాష్ట్ర ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. తమ ఆరాధ్య దైవాన్ని హింసించి, చంపేసిన.. దుర్మార్గుడు ఔరంగ జేబు సమాధిని తొలగించాలని డిమాండ్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల నిరసన ర్యాలీలు, ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. ఓ వర్గానికి సంబంధించిన ప్రార్థనా స్థలంపై దాడి చేశారంటూ.. షహీమ్ ఖాన్ తప్పుడు ప్రచారాన్ని నిర్వహించాడు. దాంతో.. వారంతా ఏకమై, ఉద్దేశ్యపూర్వతంగా ఆలయాలు, ఇతర హిందువుల ఆస్తులపై దాడులకు తెగబడ్డారు.
Also Read : IPL Madness : ఐపీఎల్ చూస్తూ ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ – వీడియో వైరల్ అయిన తర్వా…