E-Paper
Advertisement

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?
Advertisement

Bigg boss 10 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరూ ఊహించని పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నాగార్జున చెప్పినట్టే దశావతారంలో ట్విస్ట్ లు పదింతలు ఉంటాయని చెప్పారు. కానీ ఇక్కడ వంద రెట్లు ఉన్నాయంటూ అటు బిగ్ బాస్ రివ్యూయర్లు కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరి ఊహకందని ట్విస్ట్ లు ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా నాల్గవ వారం కెప్టెన్సీ రేసులో ఎవరు గెలుస్తారు? అనే ఉత్కంఠలో.. ఆఖరి టాస్క్ లో అమన్ ఎట్టకేలకు తన కష్టంతో కెప్టెన్సీ పదవిని దక్కించుకున్నప్పటికీ, మ్యాజిక్ కీ కారణంగా ఆ కెప్టెన్సీ ని వర్షిణీ లాగేసుకోవడం ఆశ్చర్యంగా మారింది. మరి ఇంతకీ ఆ మ్యాజిక్ కీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మ్యాజిక్ ‘కీ’ తో కెప్టెన్సీని దక్కించుకున్న వర్షిణి..

బిగ్ బాస్ సీజన్ 10 నాలుగవ వారంలో భాగంగా మూడవ కెప్టెన్సీ రేసులో జరిగిన ట్విస్ట్ తో పాటు ఓటింగ్ ట్రెండ్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. నాలుగవ వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీ ముగిసే సమయానికి అమన్ విజేతగా నిలిచారు
. దీంతో అతడే హౌస్ కి మూడవ కెప్టెన్ అవుతారని మిగతా కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. అయితే కెప్టెన్సీ పదవిని దక్కించుకున్న ఆనందం అమన్ కి కొద్దిసేపు కూడా లేకుండా పోయింది . కెప్టెన్సీ టాస్క్ పూర్తయిన తర్వాత హౌస్ లోకి ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ కీని పంపించారు బిగ్ బాస్. అయితే వర్షిణికి సంబంధించిన ప్రత్యేక పవర్.. ఆ కీ కి లింక్ అయి ఉండడం ఆసక్తిని కలిగించింది . అలా తనకున్న పవర్ తో ఆ మ్యాజిక్ కీ దక్కించుకున్న వర్షిణి.. మా మ్యాజిక్ కీని ఉపయోగించి తనకు లభించిన ప్రత్యేక అధికారాన్ని యాక్టివేట్ చేసుకుంది.

పవర్ ఉపయోగించి కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి..

Advertisement

అలా ఆ పవర్ ఉపయోగించి టాస్క్ లో విజయం సాధించి, అమన్ కి దక్కిన కెప్టెన్సీని, ఆమె తనకు అవకాశం గా మార్చుకుంది. అలా అమన్ గెలిచిన కెప్టెన్సీ అవకాశాన్ని తన పవర్ ఉపయోగించి లాగేసుకున్న వర్షిణి నాలుగవ వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. మొత్తానికి అయితే టాస్క్ గెలిచినప్పటికీ.. చివరికి కెప్టెన్ కాలేకపోవడం అటు హౌస్ లోనే కాదు ఇటు ప్రేక్షకులలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఈ సీజన్ లో ప్రతి వారం కొత్త తరహా ట్విస్ట్ లు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

also read:3 సార్లు బ్రేకప్.. కోలుకోలేకపోయాను – సుప్రీత

డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు?

Advertisement

ఇకపోతే నాలుగవ వారం ఎలిమినేషన్ లో భాగంగా త్రిగున్, ముఖేష్ , రోహిత్, శాలిని, సృష్టి ,చరణ్ , నరేష్, దేబ్జాని, అమన్ లు మొత్తం తొమ్మిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ ఎలిమినేషన్ రేస్ లో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్లిపోతారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఓట్ల పరంగా మొదట్లో సృష్టి డేంజర్ జోన్ లో ఉండగా.. ఆ తర్వాత దేబ్జానీ ఓటింగ్ పరంగా వెనుకబడినట్లు వార్తలు వచ్చాయి.

అమన్ కి ముప్పు ఎదురవుతోందా?

ఇక తాజా ట్రెండ్స్ లో మాత్రం అమన్ చివరి స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కెప్టెన్సీ కోసం పోటీపడి కెప్టెన్సీ ని దక్కించుకున్నప్పటికీ వర్షిణి కారణంగా కెప్టెన్సీ పదవిని పోగొట్టుకున్న అమన్ కి ఎలిమినేషన్ ముప్పు ఎదురవుతోందా ? అనే చర్చ మొదలవుతోంది. మరి చూద్దాం ఈ వారం ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్తారో..

?stkn=cnQ3dXVjdm4xOG5n

Related News

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కరిగిపోయిన మీనాక్షి.. పార్వతికి నిజం చెప్తారా..?

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి డెడ్ లైన్.. నర్మద నిజం బయపెట్టేస్తుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Karthika Deepam 2 Serial Today Episode October 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిక షాక్ ఇచ్చిన జ్యోత్స్న – సూరజ్ పీఏగా జ్యోత్స్న            

Big Stories

Advertisement
×