Viral video: టెక్నాలజీ యుగంలో వ్యక్తులు తమ కార్యకలాపాలతో బిజీ అయ్యారు.. అయిపోతున్నారు. బస్ స్టేషన్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ చూసినా వారిలో చిన్నారులు, పెద్దల చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయని భావిస్తుంటారు.
చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఏమైపోతున్నా పట్టంచుకోరు. అలాంటి ఘటన ఒకటి ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది. రెండు వ్యక్తులు గొడవకు దిగితే ఎవరో ఒకరు వచ్చి సర్ది చెప్పడం జరిగేది. ఇదంతా పదేళ్ల కిందట మాట. అసలే టెక్ యుగం.. యువతీ యువకులు బిజీ అయిపోయారు. క్షణం తీరిక దొరికితే చాలు.. సెల్ ఫోన్ మీదకు చెయ్యి వెళ్లి పోతుంది.
ఇక ఢిల్లీ మెట్రో గురించి చెప్ప నక్కర్లేదు. రోజుకో ఇష్యూ జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఫైటింగ్ జరిగింది. వారి మధ్య గొడవ ఎందుకు, ఎలా జరిగిందనేది కాసేపు పక్కన బెడదాం.
ఓ యువతి వచ్చి ఇద్దరు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం చేసింది. కాసేపటికి యువకుల మధ్య గొడవ నెమ్మదించింది. గొడవ జరుగుతున్న సమయంలో రైలు బోగీలో చాలామంది ఉన్నారు.
ALSO READ: మరోసారి ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఫైర్, అబద్ధాలు మానకుంటే..
యవకుల మధ్య గొడవకు సినిమా మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ తతంగాన్ని వీడియోలో షూట్ చేసినవారు కొందరైతే.. సెల్‌ఫోన్‌లో తమ పని చేస్తూ ఫైటింగ్‌ని చూసేవారు మరికొందరు. ఇదీ ప్రస్తుత మన ప్రపంచం. వీరెప్పుడు మారుతారో చూడాలి.
ఇక వీడియో విషయానికొద్దాం. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రావెలర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన ఓ యువకుడు, తాగుబోతుపై రుసరుసలాడాడు. ఆపై పంచ్‌లు విరుచుకుపడ్డాడు. పరిస్థితి గమనించిన ఆ యువతి గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్కేద్దాం.
మెట్రోలో మరో వివాదం..! ప్రేమ జంట పై దాడి చేసిన యువకుడు
ప్రేమ జంటకి ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. దీంతో సదరు ప్రయాణికుడు ఆ కుర్రాడును దుర్భాషలాడారు. దీంతో సహనం కోల్పోయిన ఆ కుర్రాడు వ్యక్తిని పలుమార్లు చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే తోటి ప్రయాణికులు వారికి సర్ది చెప్పడంతో గొడవ… pic.twitter.com/3V8kT8uEQu
— ChotaNews (@ChotaNewsTelugu) November 10, 2024