BigTV English

NEET PG Admit Card 2024: నేడు నీట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

NEET PG Admit Card 2024: నేడు నీట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

NEET PG Admit Card 2024: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పీజీ అడ్మిట్ కార్డు 2024కు సంబంధించి తాజాగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నేడు నీట్ పీజీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు NBEMS NEET PG హాల్ టిక్కెట్‌లను NBEMS అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్‌ను మరొక అధికారిక వెబ్‌సైట్- nbe.edu.inలో ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే అడ్మిట్ కార్డ్ విడుదల సమయం గురించి మాత్రం ఎటువంటి సమాచారం వెలువడలేదు.


ఇదిలా ఉండగా, నీట్ పీజీ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్‌ను ఆగస్టు 9 న అంటే రేపు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పరీక్షా కేంద్రానికి చేరుకోవడం చాలా కష్టంగానూ, అసౌకర్యంగానూ ఉందని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినందున ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. NEET PG హాల్ టిక్కెట్‌లతో పాటు, పరీక్షా నగరంలో కేటాయించబడిన పరీక్షా కేంద్రాన్ని NBEMS అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్ ద్వారా తెలియబోనున్నాయి. ఈ సంవత్సరం, NEET PG పరీక్ష ఆగస్టు 11న రెండు షిఫ్టులలో జరుగుతుంది. షిఫ్ట్ వివరాలను ఇప్పటివరకు బోర్డు అధికారికంగా ప్రకటించలేదు.

పరీక్ష ఒకే రోజు మరియు ఒకే సెషన్‌లో సీబీటీ మోడ్‌లో జరుగుతుంది. నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రం 200 ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ఒక్క ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇంగ్లీష్‌లో మాత్రమే డిస్‌ట్రాక్టర్‌లతో ఉంటాయి. అభ్యర్థులు ప్రతి ప్రశ్నలో అందించిన 4 ఆప్షన్లలో సరైన/అత్యంత సముచితమైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.


నీట్ పీజీ పరీక్ష అనేది దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలలు అందించే అన్ని పోస్ట్ ఎంబీబీఎస్, డీబీఎస్ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ డైరెక్ట్ 6-సంవత్సరాల డా.ఎన్బీ కోర్సులు మరియు ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్, పరీక్ష నగరం మరియు ఇతర వివరాల కోసం తాజా అప్‌డేట్‌ల కోసం వెబ్ సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×