BigTV English

Water Leak : పార్లమెంట్ భవనంలో వాటర్ లీక్.. ఏడాదికే ఇలా ?

Water Leak : పార్లమెంట్ భవనంలో వాటర్ లీక్.. ఏడాదికే ఇలా ?

Rain Water Leakage in New Parliament Lobby: ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో వాటర్ లీక్ అవుతోంది. ఈ ఘటనను కాంగ్రెస్ ఎంపీలు వీడియోలు తీసి.. నెట్టింట పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ దీనిపై లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్ భవనం పై కప్పు నుంచి వర్షపు నీరు లీకవ్వడంపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. జూలై 31న కురిసిన భారీ వర్షాల కారణంగా పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీల నేపథ్యంలో పార్లమెంట్ భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ప్రతిపాదించారు.


పార్లమెంట్ లో వర్షపు నీరు లీకేజీపై కమిటీ వేస్తే.. ఆ కమిటీ అందుకు గల కారణాలపై దృష్టి పెడుతుందన్నారు. పార్లమెంట్ భవనం డిజైన్, మెటీరియల్స్ ను పరిశీలించి.. అత్యవసరమైన మరమ్మతులను సిఫార్సు చేస్తుందని వాయిదా తీర్మాన నోటీసులో పేర్కొన్నారు.

లోక్ సభలో వాయిదా తీర్మానంకంటే ముందు ఆయన X వేదికగా ఒక ట్వీట్ చేశారు. బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు జరుగుతున్నాయని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇటీవల రాష్ట్రపతి ఉపయోగించిన పార్లమెంట్ లాబీలో వర్షపు నీరు లీకవ్వడం.. అత్యవసర వాతావరణ స్థితిస్థాపకత సమస్యల్ని చూపుతోందన్నారు. కొత్త భవనం నిర్మించిన ఏడాదికే వర్షపునీరు లీకవ్వడం వింతగా ఉందంటూ.. ఆ వీడియోను షేర్ చేశారు. మాణికం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు.


కాగా.. ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మే 28,2023న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. గతేడాది సెప్టెంబర్ 19న ఈ భవనంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అప్పటి వరకూ పార్లమెంట్ గా ఉన్న భవనాన్ని వారసత్వ సంపదగా ఉంది.

Related News

Los Angeles News: అందరూ చూస్తుండగా.. భారతీయుడిని కాల్చి చంపారు.. ఇదిగో వీడియో!

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Big Stories

×