BigTV English
Advertisement

INDIA Bloc Speaker Nomination: కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం.. స్పీకర్‌ అభ్యర్థిత్వంపై టీఎంసీ ఎంపీ..!

INDIA Bloc Speaker Nomination: కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం.. స్పీకర్‌ అభ్యర్థిత్వంపై టీఎంసీ ఎంపీ..!

TMC MP Comments on INDIA Bloc Speaker Candidature of K Suresh: ఇండియా కూటమి తరఫున స్పీకర్ అభ్యర్థిగా కే సురేష్‌ను ప్రతిపాదించే ముందు తమ పార్టీని సంప్రదించలేదని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మంగళవారం అన్నారు.


ప్రతిపక్షాల స్పీకర్ అభ్యర్థిని ప్రతిపాదించే అంశంలో అసలు చర్చ జరగలేదని.. ఇది కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయమని పార్లమెంట్ వెలుపల అభిషేక్ బెనర్జీ అన్నారు.

కాగా ఈ ఉదయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పీకర్ పదవికి ఓం బిర్లాను ప్రతిపాదించింది. అయితే ప్రతిపక్షాలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ కే సురేష్‌ను నిలబెట్టింది. బీజేపీ నేతలు ఇండియా కూటమి నేతలను ఒప్పించడానికి ప్రయత్నించినా.. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వకుంటే తాము తమ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశారు.


Also Read: Arvind Kejriwal: నేనేం తప్పు చేయలేదు: కేజ్రీవాల్

స్వయంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి మంగళవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టీఆర్ బాలుతో సమావేశమయ్యారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కట్టబెట్టాలని వారు రాజ్‌నాథ్ సింగ్‌ను కోరగా ఆయన దాన్ని తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష నాయకులు మంత్రి కార్యాలయం నుంచి వాకౌట్ చేశారు.

ఈ విషయంపై కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, లలన్ సింగ్‌లు స్పందించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు తమ డిమాండ్‌పై చర్చకు అధికార ఎన్డీయే కూటమి సుముఖంగా ఉందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ షరతులు విధించిందని కేంద్ర మంత్రులు ఆరోపించారు.

అయితే ఇప్పటివరకు స్పీకర్ పదవికి పార్లమెంట్‌లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్డీయే, ఇండియా కూటమి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మూడోసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. అయితే మమతా బెనర్జీని ఇండియా కూటమి నేతలు సంప్రదించకపొవడంతో దీదీ ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

Also Read: కుదరని ఏకాభిప్రాయం.. తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక

కాగా బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. లోక్ సభలో ఎన్డీయే కూటమికి సరిపడా మెజార్టీ ఉండటంతో ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. వయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో లోక్ సభ సభ్యుల సంఖ్య 542కు తగ్గింది. బిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావాలంటే 271 ఓట్లు రావాలి. అయితే లోక్ సభలో ఎన్డీయే కూటమికి 293మంది సభ్యులు ఉండగా.. ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు.

ప్రతిపక్ష ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్ధిగా ప్రతిపాదించిన కే సురేష్ ఇప్పటివరకు 8 సార్లు కేరళ నుంచి ఎంపీగా గెలిచారు. 4 సార్లు అడోర్ నియెజకవర్గం నుంచి గెలవగా.. మరో నాలుగు సార్లు మావెళిక్కర నుంచి గెలిచారు. తాజాగా 2024 ఎన్నికల్లో కూడా సురేష్ ఇదే స్థానం నుంచి గెలిచారు. 17వ లోక్ సభలో సురేష్ కాంగ్రెస్ పార్టీ విప్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×