BigTV English

What is Electoral Bond : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసా..?

What is Electoral Bond : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసా..?

Electoral BondsWhat is Electoral Bond: గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో చర్చ జరుగుతోంది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 15 వతేదీన ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించడంతో వీటి విషయం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి అందించింది. ఈ నేపథ్యం అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి..?
2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు నిధులు సమాకూర్చుకునేందుకు ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఈ బాండ్లను దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) జారీ చేస్తుంది. ఇవి ప్రామిసరీ నోటు వలే పనిచేస్తాయి. ఏదైనా కంపెనీ, ఎవరైనా వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందించవచ్చు. దాతల నుంచి విరాళంగా అందుకున్న ఈ బాండ్లను సదురు రాజకీయ పార్టీలు ఎస్బీఐ దగ్గర నగదుగా మార్చుకుంటాయి. అయితే ఈ బాండ్లను ఎవరు ఎన్నైనా కొని రాజకీయ పార్టీలకు అందించవచ్చు. వీటికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

వీటిని పొందడానికి ఎవరు అర్హులు..?
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29ఎ ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలు వీటిని పొందడానకి అర్హత ఉంటుంది. అయితే ఈ పార్టీలకు గతంలో పోలైన ఓట్లలో 1 శాతం ఓట్లు లభిస్తేనే దాతల నుంచి ఎలక్టోరల్ బాండ్లు పొందడానికి అర్హత లభిస్తుంది.


ఎలక్టోరల్ బాండ్స్ ను ఎక్కడ ఎన్‌క్యాష్ చేయాలి, అది ఎలా..?
ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో మాత్రమే ఎన్‌క్యాష్‌ చేసుకోవాలి. దేశంలోని మరే ఇతర బ్యాంకుల్లో వీటిని మార్చుకోవడానకి అవ్వదు. ఎస్బీఐ నిర్దేశించి శాఖల్లో మాత్రమే వీటిని రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలక్టోరల్ బాండ్ యొక్క చెల్లుబాటు వ్యవధి ఏమిటి?
దాతలు రాజకీయ పార్టీలకు అందించిన ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ 15 రోజుల్లోపు రాజకీయ పార్టీలు బాండ్లను ఎస్బీఐలో ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ఒకవేళ దాన్ని ఎన్ క్యాష్ చేసుకోవడంలో విఫలమైతే ఆ బాండ్ నిరుపయోగంగా మారుతుంది.

Also Read: Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల కేసులో SBIకు మరో బిగ్ షాక్.. మళ్లీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..!

ఎలక్టోరల్ బాండ్‌ల వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది..?
దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ధి పొందుతారు. పబ్లిక్ లేదా కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలను అందుకుంటారు.

ఎలక్టోరల్ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి?
అర్హతగల వ్యక్తులు, సంస్థలు రూ. 1,000 నుండి రూ. 1 కోటి వరకు వివిధ డినామినేషన్‌లలో SBI అందించే నిర్దిష్ట శాఖల నుండి ఎలక్టోరల్ బాండ్‌లను కొనుక్కోని రాజకీయ పార్టీలకు అందించవచ్చు.

ఎలక్టోరల్ బాండ్లను ఎందుకు జారీ చేస్తారు..?
దేశంలోని రాజకీయ పార్టీలకు అందించే విరాళాలకు బ్యాంకుల ద్వారా చట్ట బద్ధత కల్పించి, సరైన మార్గంలో విరాళాలు అందేటట్టు చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లు ఆర్టీఐ పరిధిలోనికి రావు. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ ను సుప్రీంకోర్టు సవాల్ చేయడంతో వీటి స్థానాన్ని ప్రస్తుతం ఎలక్టోరల్ ట్రస్ట్‌లు భర్తీ చేశాయి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. దీంతో వీటిపై ప్రతిపక్షాలు ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే రాజకీయ పార్టీలు తమ విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో ఈ బాండ్ల వివాదం మొదలైంది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ బాండ్లు కచ్చితంగా క్విడ్ ప్రో కో కిందకు వస్తాయని స్పష్టం చేసింది. ఇవి రాజ్యాంగ విరుద్ధమని, పారదర్శకత లోపించిందని వీటిని ఫిబ్రవరి 15 వతేదీన నిషేధించింది.

Tags

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×