Big Stories

Rahul Gandhi: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. వారిపై కఠిన చర్యలు తప్పవు: రాహుల్ గాంధీ

Rahul GandhiRahul Gandhi latest news(Political news telugu): సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తున్న ప్రభుత్వం సంస్థలపై చర్యలు తీసుకుంటామి రాహుల్ గాంధీ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రూ.1,800 కోట్లు ఆదాయపు పన్ను నోటీసులు అందడంపై రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

అధికార ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితేనే మళ్లీ అలాంటి వారు ఇటువంటివి చేసే ధైర్యం చేయరని అన్నారు. తాము తీసుకునే చర్యలు అలా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అంధిన పన్ను నోటీసులను.. ఉగ్రపన్ను నోటీసులుగా కాంగ్రె పార్టీ అభివర్ణించింది.

ఈడీ బీజేపీ చెప్పు చేతల్లో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను వంటి కేంద్ర శాఖలు కూడా బీజేపీ కనుసన్నల్లోనే.. వారి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నవారినిపై చర్యలు తీసుకోవడం అనేది తన హామీ అనేది రాహుల్ గాంధీ తెలిపుతూ ట్వీట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

Also Read: Bengaluru Cafe Blast: రామేశ్వరం కేఫ్ బాంబు దాడి.. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షలు

తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తూ మరో వీడియోను పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు పురుషులతో తగ్గట్టుగా ఉద్యోగాలు లభించాలని కాంగ్రెస్ కోరుకుంటుందని అన్నారు. మహిళలు శక్తి వంతం అయితే భారతదేశం భవితవ్యం మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News