BigTV English

Canada: భగవద్గీతపై ప్రమాణం.. అనితా ఆనంద్ బ్యాగ్రౌండ్ ఇదే..!

Canada: భగవద్గీతపై ప్రమాణం.. అనితా ఆనంద్ బ్యాగ్రౌండ్ ఇదే..!

Canada: విదేశాల్లో భారత సంతతికి చెందిన ప్రజల హవా కొనసాగుతోంది. పలు దేశాల్లోని ప్రభుత్వాల్లో మన మహిళలు కీలక పదవులను చేపడుతున్నారు. తాజాగా కెనడా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ఉన్నత పదవిని అధిష్టించారు. కెనడా ప్రభుత్వంలో అనితా ఆనంద్.. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మార్క్‌ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలోనే ఆయన తన మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌కు చోటు దక్కింది. అనితా ఆనంద్.. కెనడా ప్రభుత్వంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు స్వీకరించారు. భారత సంతతికి చెందిన అనిత గతంలో రక్షణమంత్రిగానూ వ్యవహరించారు. తాజాగా విదేశీ వ్యవహారాల బాధ్యతలు చేపట్టిన ఆమె.. భగవద్గీత చేత పట్టుకొని ప్రమాణస్వీకారం చేయడం విశేషం.

తమిళ, పంజాబీ మూలాలున్న అనితా ఆనంద్‌..కెనడాలోని నోవాస్కోటియాలోని కెంట్‌విల్లేలో జన్మించారు. తల్లి సరోజ్‌ దౌలత్‌రామ్‌ అనస్తీషియాలజిస్ట్‌. అనితా తల్లి సొంతూరు పంజాబ్‌. జనరల్‌ సర్జన్‌ అయిన తండ్రి సుందరం వివేక్‌ స్వస్థలం తమిళనాడు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి అనిత. ఈమెకు ఇద్దరు చెల్లెళ్లు గీత, సోనియా ఉన్నారు.


పొలిటికల్‌ సైన్స్‌లో అకడమిక్‌ డిగ్రీ చదివిన అనితా ఆనంద్.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశారు. డల్హౌసీ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యలో మాస్టర్స్‌ చదివారు. కార్పొరేట్‌ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో లా ప్రొఫెసర్‌గా, విజిటింగ్‌ లెక్చరర్‌గా, బోర్డు సభ్యురాలిగానూ పని చేశారు. కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త జాన్‌ నోల్టన్‌ను అనిత వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు

ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనితా ఆనంద్ తనదైన ముద్ర వేశారు. లిబరల్‌ పార్టీ సభ్యురాలిగా 2019లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఓక్‌విల్లే నుంచి మొదటిసారి ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ.. అప్పటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్‌ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్‌ మంత్రిగా పనిచేశారు. కెనడాలో ఈ పదవిని అలంకరించిన మొదటి హిందూ మంత్రిగా అనితా ఘనత సాధించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్షణమంత్రిగానూ వ్యవహరించారు.

Also Read: కరాచీ పోర్ట్ టార్గెట్ గా.. రంగంలోకి INS విక్రాంత్

రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో అనితా ఆనంద్ కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల్ని ఆరికట్టారు. లింగసమానత్వం, డైవర్సిటీ, ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం గళమెత్తారు. ఆ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

 

Related News

Artificial Rain: డ్రోన్లతో వర్షమంటూ ప్రయోగం.. ఎగిరాయి కానీ, అంతా శూన్యం.. ఎక్కడంటే?

Delhi News: ఢిల్లీలో ఘోర ఘటన.. గోడ కూలి ఐదుగురు మృతి.. మరికొందరు శిథిలాల కిందే!

Draupadi Murmu: సెల్యూట్ ముర్ము జీ.. జోరు వానలోనూ అమరవీరులకు నివాళి.. ఈ వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

Food culture: ఆ రాష్ట్రంలో మటన్, చికెన్ తెగ తినేశారు.. ఒక్క రోజులో అన్ని కోట్ల వ్యాపారమా!

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

Independence Day 2025: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియాపై దృష్టి

Big Stories

×