INS Vikrant – Karachi: పహెల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది భారత్. ఈ ఆపరేషన్ జరిగే సమయంలో అయినా జరిగిన తర్వాత అయినా.. పాక్ ఏదైనా తోక జాడిస్తే ఎలా? భారత పశ్చిమ తీరాన్ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలను ముందే వేసుకున్న కేంద్రం.. ఇండియన్ నేవీని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ ఏదైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే కరాచీని టార్గెట్ చేయాలని ఇండియన్ నేవీ డిసైడ్ అయ్యి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే కరాచీకి అతి సమీపంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇండియన్ నేవీ మోహరింపులు చేపట్టింది. ఏకంగా 36 నేవీ అసెట్స్ కరాచీ సమీపంలో కాచుకొని కూర్చున్నట్టు ఇప్పుడు బయటికి వచ్చింది.
పహెల్‌గామ్ దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే అరేబియన్ సముద్రంలో INS విక్రాంత్ కనిపించింది. అయితే ఇదంతా రోటిన్ వ్యవహారం అని అంతా కొట్టిపారేశారు. కానీ INS విక్రాంత్ అరేబియన్ సముద్రంలోకి ఏ కారణంతో వచ్చినా దానిని రూట్‌ను కరాచీవైపు మార్చారు. కేవలం INS విక్రాంత్ మాత్రమే కాదు.. దానికి తోడుగా 8 నుంచి 10 యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. ఇందులో ఏడు యుద్ధ నౌకల్లో బ్రహ్మోస్ మిసైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, వరుణాస్త్ర హెవీవెయిట్ టార్ఫిడోలను మోహరించారు. అంటే పాకిస్థాన్ ఎలాంటి దాడులకైనా సిద్ధపడితే వాటిని ఎదుర్కోనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉంది ఇండియన్ నేవీ. సర్ఫేస్, ఏరియల్, అండర్ వాటర్ థ్రెట్స్‌ను కూడా ఎంగేజ్ చేయడానికి ఫుల్ ప్రిపేర్ అయ్యింది ఇండియన్ నేవీ.
వీటితో పాటు కొత్తగా నేవీలో చేరిన INS తుషిల్‌తో పాటు.. ఏడు స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రీగెట్స్ కూడా పశ్చిమ తీరానికి రక్షణగా ఉన్నాయి. అంతేకాదు దాదాపు ఆరు సబ్‌మెరైన్‌లు కూడా కరాచీ తీరంలో చక్కర్లు కొట్టినట్టు చెబుతున్నారు. మొత్తంగా 36 నేవీ అసెట్స్.. కరాచీని టార్గెట్ చేసి రెడీగా ఉన్నాయి. మరో హైలేట్ ఏంటంటే.. వీటిలో ఆరు యుద్ధ నౌకలు 1971 యుద్ధ సమయంలో కరాచీపై దాడి చేసినవే కావడం.
కరాచీలో పాకిస్థాన్ నేవీ బేస్ ఉంది. అందుకే ఈ స్థాయిలో మోహరింపులను చేసింది ఇండియన్ నేవీ. మన మోహరింపులను చూసి కూడా పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకంటే అక్కడున్న నేవీ కంటే.. చాలా ఎక్కువ స్థాయిలో ఇండియన్ నేవీ బలం కనిపిస్తుండటంతో పాక్ కనీసం పట్టించుకోనట్టే ఉండిపోయింది. అదే సమయంలో నవేరా వార్నింగ్స్‌ను మాత్రం ఇష్యూ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో ఇలాంటి వార్నింగ్స్ ఇస్తాయి ఆయా దేశాల నేవీలు.
Also Read: అరుణాచల్ ప్రదేశ్ మాదే.. పేరు మార్చేసి చైనా ఏం చేసిందంటే
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పశ్చిమ తీరంపై పాక్ ఏదైనా దాడి మొదలు పెడితే దానిని అడ్డుకోవడానికి.. అదే సమయంలో కరాచీపై తమ ప్రతాపం చూపించేందుకు ఇండియన్ నేవీ సర్వ సన్నద్దంగా ఉందనే విషయం దీనిని బట్టే అర్థమవుతోంది. ఆకాశంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. సముద్రంలో ఇండియన్ నేవీ.. సరిహద్దుల్లో బలగాలు.. ఇలా అన్ని రకాలుగా ప్రిపేర్ అయిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అందుకే పరువు పోకుండా పైపైన దాడులు చేసి చేతులు దులుపుకుంది పాకిస్థాన్ ఆర్మీ. త్రివిధ దళాల ముందు చూపు.. భారీ దాడులను ఆపాయనే చెప్పాలి.