BigTV English

Ratan Tata Love Story: లైఫ్‌లో సూపర్ సక్సెస్.. లవ్‌లో మాత్రం? కన్నీళ్లు పెట్టించే టాటా ప్రేమకథ, అందుకే పెళ్లికి దూరం!

Ratan Tata Love Story: లైఫ్‌లో సూపర్ సక్సెస్.. లవ్‌లో మాత్రం? కన్నీళ్లు పెట్టించే టాటా ప్రేమకథ, అందుకే పెళ్లికి దూరం!

Ratan Tata Marriage: ఆయనొక శిఖరం. వ్యాపార సామ్రాజ్యంలో సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్. వ్యాపార రంగంలో ఎన్నో ఆవిష్కరణలు ఆయన సొంతం. పేదవారికి గల కారు కల సాకారం చేయాలని.. కేవలం లక్ష రూపాయలకే నానో కారు అంటూ.. బిజినెస్ ట్రిక్ ప్రయోగించారు. నేటికీ టాటా కంపెనీ నానో కార్లు రయ్.. రయ్ అంటూ చక్కర్లు కొడుతున్నాయి. మానవతావాదిగా.. వ్యాపారవేత్తగా ఎనలేని గుర్తింపు పొందిన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మృతి యావత్ భారతావనికి తీరని లోటు.
బిజినెస్ లో రాణించి లైఫ్ సక్సెస్ ఫుల్ గా సాగించిన రతన్ టాటా (Ratan Tata) వైవాహిక జీవితానికి దూరమయ్యారు. దానికి కారణం ఆయన అమెరికాలో ఉన్న సమయంలో లవ్ లో పడ్డారు.. కానీ లవ్ లో మాత్రం సక్సెస్ సాధించలేక పోయారు టాటా. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా స్వయంగా చెప్పారు.


అసలేం జరిగిందంటే…
అమెరికాలో రతన్ టాటా (Ratan Tata) ఉద్యోగం చేసే సమయంలో లవ్ లో పడ్డారు. కళాశాల ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న అనంతరం.. లాస్ ఏంజిల్స్ లోని ఒక కంపెనీలో రెండేళ్ల పాటు టాటా పని చేశారు. అక్కడ ఉద్యోగం చేసే సమయంలో.. ఓ యువతిని ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలని సైతం నిశ్చయించుకున్నారు. వివాహం చేసుకొని భారత్ కు రావాల్సిన టాటా ఆశలు అడియాశలయ్యాయి.

ఇండో – చైనా యుద్ధం వారి ప్రేమకు అడ్డుగా మారి.. టాటా లవ్ ఫెయిల్యూర్ అయ్యేలా చేసింది. తన అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో భారత్ కు రావాలని భావించారు టాటా. అయితే తన ప్రియురాలితో కలిసి భారత్ కు రావాలనుకున్న ఆయన కోరిక తీరలేదు. కారణం.. ఇండో – చైనా యుద్ధం వల్ల ఆమె తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించకపోవడమే. ఇక అంతటితో టాటా ప్రేమాయణంకు ముగింపు పడింది.


Also Read: Ratan Tata: వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరు.. దేశం దిగ్భ్రాంతి

ఆ ఒక్క కారణంతో పెళ్లికి దూరం…
తన లైఫ్ లో జరిగిన ఓ బాధకర ఘటనతో వైవాహిక జీవితానికి తాను దూరమైనట్లు రతన్ టాటా (Ratan Tata) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రతన్ టాటా తల్లిదండ్రులు ఆయనకు పదేళ్ల వయస్సులోనే విడిపోయారు. దీనితో రతన్ టాటా (Ratan Tata).. ఆయన తమ్ముడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారట. తన తల్లి రెండో వివాహం చేసుకున్న సమయంలో, పాఠశాలకు వెళ్లిన రతన్ టాటాను స్నేహితులు ర్యాగింగ్ చేసే వారని చెప్పారు.

అయితే తన అమ్మమ్మ సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే.. గొడవలు పడకూడదని తనకు నేర్పించిందన్నారు. బిజినెస్ లో సక్సెస్ సాధించిన అనంతరం చాలా సమయాల్లో వివాహం చేసుకోవాలని ఆలోచన వచ్చినా.. వ్యాపార రంగంలో బిజీ కావడంతో.. కుటుంబానికి సమయం కేటాయించలేనేమోనన్న భయం వేసేదట టాటాకు. అందుకే చాలాసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెడదామని భావించిన దూరమైనట్లు టాటా నాటి ఇంటర్వ్యూలో వివరించారు.

బిజినెస్ పరంగా సక్సెస్ సాధించిన రతన్ టాటా.. లవ్ కు యుద్ధం అడ్డుగా మారి.. ఫెయిల్యూర్ కి గురి చేసింది. కానీ మానవతావాదిగా.. దేశానికి తన అవసరమైనప్పుడల్లా.. ముందడుగు వేసి దేశభక్తిని చాటుకున్న రతన్ టాటా .. ఇకలేరు.. ఇకరారు.

Related News

UP News: విద్యా అధికారిపై కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Big Stories

×