Podarillu Today Episode august 11th: నువ్వు ఈ జాతకం చూసి బాధ పడిపోతున్నావ్ కదా అన్నయ్య నీకోసం నేను పదిమంది జ్యోతిష్యులు తీసుకొని వస్తాను. వాళ్ళు ఏం చెప్తారో చూసి వాళ్ళ మాట ప్రకారం చేద్దాము అని మాధవతో చక్రి అనగానే సరే అని అంటాడు చక్రి. ఇక మాధవ్ కోసం ఉదయం లేవగానే వరుసగా జ్యోతిష్యులను తీసుకొని వస్తాడు చక్రి.. వాళ్ళందరూ కూడా మాతో జాతకం చూసి అతని దోషం ఏమీ లేదు చాలా మంచి జాతకం మీరేమీ కంగారు పడకండి కానీ మీ నాన్నగారి వల్లే అతని జాతకంలో దోషం వచ్చింది అని చెప్తారు ఒక ముక్కు తీర్చుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్పగానే ముందుగా అందరూ సంతోషపడిన ఆ తర్వాత నారాయణ మాత్రం ఆ మొక్క గురించి ఆలోచించి భయపడి పోతాడు.. ఆ ఊరిలో తీసుకోవాల్సిన మొక్కు గురించి తనలో తానే ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటాడు నారాయణని చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైంది అని అనుకుంటారు. ఆ ఊరు గురించి తెలుసుకున్న నారాయణ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ ఊరికి అంటే కష్టం అని అనుకుంటాడు. నారాయణని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైందో అని కంగారు పడతారు.
పెద్ది జాతకం బాగుందని అర్థం అయిపోయింది కదా ఇక అందరం కలిసి చాలా సంతోషంగా ఉండాలి. అయితే ఆ గ్రామ దేవత మొక్కు తీర్చుకుంటే అంత సంతోషంగా ఉండొచ్చు అని వచ్చిన ఆ జ్యోతిష్యులు కూడా చెప్పారు కదా అని మహాలక్ష్మి అంటుంది.. ఆ గ్రామ దేవత ఎక్కడుందో తెలుసుకొని మొక్కు తీర్చుకుంటే మంచిదే కదా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని మహాలక్ష్మి అంటుంది. కానీ నారాయణ మాత్రం నాకు ఆ గ్రామ దేవత ఎవరో కూడా తెలియదు. ఈ ఇంట్లోనే నేను పుట్టి పెరిగాను.. నా పూర్వీకులు పూర్వీకులు కూడా నాకు మొక్క గురించి చెప్పలేదు అని తప్పించుకుంటాడు. ఎలాగైనా సరే ఆ గ్రామ దేవత గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు కానీ నారాయణ మాత్రం నాకు తెలియదని చెప్తాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం ఎలాగైనా ఆ దేవత గురించి తెలుసుకొని మొక్కు తీర్చుకోవాలి అని అంటుంది..
మాధవ్ ఇక నాన్న గుడి గురించి తెలియదు అన్నాడు కదా ఎలాగైనా సరే నేను వర్క్ కు వెళ్లాలి అని అనుకుంటాడు. పని చాలా ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్లాలి అని అనగానే.. కన్నా నువ్వు తోడుగా వెళ్ళు అని మహాలక్ష్మి అంటుంది. అయితే కన్నా మాధవ్ ఇద్దరు వెళ్తూ ఉండగా కన్నాతో మాధవ్ నన్ను క్షమించురా.. ఇంకెప్పుడూ నేను ఇల్లు వదిలి వెళ్ళిపోని లేరా అని మాధవ్ అంటాడు.. నీ కోపం పోవడానికి నేను కేకులు కొనిపిస్తాను తింటావా అని అడుగుతాడు. కేకు కొనిపించడానికి షాప్ కి వెళ్లగానే అక్కడ ఉన్న వ్యక్తి మాధవ్ నువ్వు వెళ్ళిపోయావంట కదా మళ్లీ ఎందుకు వచ్చావు అసలు ఇంట్లో ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతాడు.. అదేవిధంగా దారిలో వెళ్లే వాళ్లందరూ కూడా మాధవ్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయే వంట కదా అని అడుగుతుండగా కన్నా కోపంగా వాళ్ళపై అరుస్తాడు..
మనీషాని వెతుక్కుంటూ తన బావ బీహార్ నుంచి హైదరాబాద్ కి వస్తాడు.. నా నుంచి దూరమైన నిన్ను అస్సలు వదలను ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటాను. ఊరంతా జల్లెడ పట్టి మరి నీకోసం వెతుకుతాను అని అతను తన మనుషులతో మనిషా కోసం వెతికిస్తాడు. అయితే మనిషా గురించి ఊరంతా వెతుకుతున్న వాళ్లకి మన అడ్రస్ గురించి చెప్తారు. ఇక మనిషి అడ్రస్ దొరికిందని ఆ వ్యక్తి చాలా సంతోషంగా అక్కడికి వెళ్లాలని అనుకుంటాడు.. వాళ్ళ బావ రావడం చూసినా బన్సీ అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయి మనీషాతో చెప్పాలని అనుకుంటాడు. అయితే మనీషా కి ఈ విషయం చెప్పగానే వాడు ఇక్కడికి కూడా వచ్చేసాడు అని షాక్ అవుతుంది.. అడ్రస్ కూడా తెలుసుకుంటారు కాబట్టి మనం ఇక నుంచి వెళ్ళిపోవాలి అని మనిషాన్ తీసుకొని మరో దగ్గరికి వెళ్లిపోతాడు..
ఇక మా ఇంటికి వెళ్ళండి అని మాధవ్ చెప్పగానే మనిషి అని తీసుకొని బన్సీ మాధవ్ వాళ్ళింటికి వెళ్తాడు.. చక్రి ఇంట్లోని వాళ్ళందరిని పిలిచి చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు.. మనము ఒక ఉద్యోగం చేయాలి అని అందరితో వెటకారంగా మాట్లాడడంతో చక్రిపై మిగిలిన వాళ్ళందరూ కూడా కౌంటర్ల వర్షం కురిపిస్తారు.. ఏంట్రా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అందరూ అడుగుతున్న సరే చక్రి మాత్రం మనిషా గురించి చెప్తాడు.. మనిషాకి సమస్య అంతా తనని మనము కాపాడాలి అని అన్నయ్య చెప్పాడు అని అనగానే మనిషాకి ఏం సమస్య వచ్చింది మిగిలిన వాళ్ళందరూ అనుమాన పడతారు.. మనీషాని ఇక్కడే ఉంచి మనమే కాపాడాలి అని చక్రి చెప్పగానే అందరూ సరే అని మనిషి అని లోపలికి తీసుకొని వెళ్తారు.
చక్రి మాధవ ఇద్దరూ కూడా ఒకసారి ఈ పెదనాన్నని మళ్లీ అడిగితే బాగుండు అని అనుకుంటారు.. ఇక పెదనాన్న ఎదురుగా వస్తున్నాడు ఆ గ్రామ దేవత మనల్ని ఎదురుగా పంపించిందేమో అని అనుకుంటారు. అయితే చక్రి మీ పెదనాన్న వస్తున్నాడు మల్ల ఒకసారి అడుగు అని చెప్పగానే మాధవ్ పెదనాన్న గ్రామదేవత గుడి గురించి చెప్పండి అని ఎంతగా అడిగినా సరే చెప్పడు.. కానీ చివరికి చక్రి చేసిన ప్లాన్ వల్ల రమణయ్య ఆ గుడి గురించి చెప్తాడు. మాధవ్ ఒక్కడినే వెళ్లి రమ్మని చెప్పు అని చెప్పగానే చక్రి వాళ్ళందరూ అనుమాన పడతారు. ఇక ఇంటికి రాగానే చక్రీ వాళ్ళందరూ గుడి గురించి చెప్తారు. నారాయణ ఆ గుడి పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో ధీరజ్ షాక్.. రామారాజుకు అవమానం.. అయ్యో పాపం ధీరజ్..