Big Stories

Happy Holi Wishes & Quotes: హోలీ.. రంగుల కేళి.. మీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇలా విష్ చేయండి!

- Advertisement -

Happy Holi Wishes & Quotes: హోలీ.. అంటే రంగుల పండుగ. ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమినాడు హోలీ పూర్ణిమను జరుపుకుంటాం. ఈ పండుగ వెనుక కొన్ని పురాణ కథలున్నాయి. దక్షయజ్ఞానికి వెళ్లి అవమానపడిన పార్వతీ దేవి యజ్ఞమంటల్లో పడి తనువు చాలిస్తుంది. కోపంతో రగిలిపోయిన శివుడు కాలభైరవుడిని సృష్టించి.. ఘోర తపస్సు చేస్తుంటాడు. రాక్షసుల ఆగడాలకు భయపడిన దేవతలు శివ తపస్సును భగ్నం చేసేందుకు మన్మథుడిచే పూలబాణాలు వేయిస్తాయి. మూడో కన్ను తెరిచి అతడిని బూడిద చేస్తాడు. రతీదేవి అభ్యర్థనతో ఆమెకు మాత్రమే కనిపించేలా వరమిస్తాడు. హోలీ ముందు రోజున మంటలు వేసి కాముడి పున్నమిని జరుపుకుంటారు ప్రజలు.

- Advertisement -

అలాగే కృతయుగంలో పిల్లల్ని వేధించే.. హోలిక అనే రాక్షసిని పూజించడంతో ఆమె పిల్లల్ని వేధించడం మానేసింది. అప్పటి నుంచి హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని చెబుతుంటారు. రాధ-కృష్ణ, ప్రహ్లాదుడి కథలు కూడా ఉన్నాయి. మన దేశంలో ప్రేమ, ఐక్యత, ఆనందాన్ని చూపే పండుగ. ఈ ఏడాది మార్చి 25న హోలీ జరుపుకుంటున్నాం. ఈ పండుగ మన జీవితాల్లో కళ, అందం మరియు చైతన్యాన్ని సజావుగా అనుసంధానించే రంగుల కలయికకు అంకితం. పండుగలన్నింటిలోనూ రంగుల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. రంగురంగుల సంస్కృతి సంప్రదాయం, హోలీ అనేది మనకు ఆటపాటలను నేర్పే భావోద్వేగం.

Also Read: హోలీ దహనంలో ఇలా చేయండి.. ఊహించని సంపద లభిస్తుంది!

డోల్ జాత్రా’, ‘దుల్హందీ’, ‘డోల్ పూర్ణిమ’, ‘రంగ పంచమి’ వంటి ఇతర పేర్లతో కూడా పిలువబడే హోలీని భారతదేశం అంతటా వివిధ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జరుపుకుంటారు. ఈ పండుగను గుజియా, భాంగ్, తండై, మత్రి పంపిణీ చేయడం ద్వారా ప్రముఖంగా ఆనందిస్తారు. ప్రజలు ఒకరినొకరు ‘గులాల్’, ‘బురా నా మానో హోలీ హై’ అనే ప్రసిద్ధ పదబంధంతో పలకరించుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి కూడా ఈ పండుగ ప్రతీక. ప్రహ్లాదుడి విశ్వాసం, విష్ణువు పట్ల భక్తితో అతనిని అగ్నిలో కాల్చివేయబడకుండా రక్షించిన కథ హోలీకి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే.. రాధా రాణి శరీరం ఛాయ తెలుపు. అలాంటి మేనిపై కృష్ణుడు ఒకసారి కొంటెగా, సరదాగా రంగులు పూశాడు. అప్పటి నుంచి హోలీ అంటే.. ప్రేమ పండుగగా కూడా జరుపుకుంటారు. మరి మీరు మీ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారా ? చెప్పకపోతే.. ఈ కోట్స్ తో హోలీ విషెస్ చెప్పేయండి.

1. సంతోషమనే రంగును జీవితంలోకి ఆహ్వానించాలి. అప్పుడే ఆనందం అనే హరివిల్లుపై హాయిగా జీవిస్తారు. హోలీ శుభాకాంక్షలు.

2. హోలీ రంగుల పండుగ. ఆ రంగుల్లాగే మన జీవితంలోనూ సంతోషం, బాధ, ప్రేమ, విషాదం, ఉంటాయి. అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తేనే జీవితం. మీ జీవితం రంగులమయం కావాలని కోరుకుంటూ.. హ్యాపీ హోలీ.

3. రంగుల పువ్వులు వికసించే ఈ వసంతం.. మీ జీవితంలో నవ వసంతాన్ని నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

4. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ హోలీ. సుఖం, దుఃఖం, సంతోషం, విచారం అన్నీ కలిసిన రంగుల పండుగే ఈ హోలీ. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోటకు చేర్చే పండుగ ఈ హోలీ. మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు హోలీ శుభాకాంక్షలు.

5. రంగుల పండుగ వచ్చింది. అందరిలో ఆనందాన్ని తెచ్చింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

6. ఆ నింగిలోని హరివిల్లు మీ ఇంట విరియాలి. ఆ ఆనందపు రంగులు మీ జీవితంలో నిండాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు రంగుల పండుగ శుభాకాంక్షలు.

7. పిచ్కారీ కి ధర్,
గులాల్ కి బౌచర్,
అప్నో కా ప్యార్,
యహీ హై యారోన్ హోలీ కా త్యోహర్.
హోలీ శుభాకాంక్షలు!

8. శ్రీకృష్ణుడు, రాధా రాణి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండుగాక. హోలీ శుభాకాంక్షలు!

9. ప్రియమైన మిత్రమా, ఇంద్రధనస్సు వలె నీ జీవితం ప్రేమ, స్నేహం, ఆనందం అనే రంగులతో ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ..హోలీ శుభాకాంక్షలు!

10. హోలీ పండుగ మీకు మంచి ఆరోగ్యాన్ని, సంపదను, శాంతిని, ఆనందాన్ని తీసుకురావాలి. ప్రేమ, కరుణ భావాలతో మన హృదయాలను నింపుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు!

11. కాముని రహనం చేసి హోలీ సంబరాలను ఆహ్వానిద్దాం. రంగుల్లో మునిగి తేలుదాం. అందరికంటే ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

12. చలికి, పొగమంచుకి గుడ్ బై చెప్పి.. వెచ్చదనానికి వెల్కమ్ చెప్పే హోలీ. చిన్నా, పెద్ద అనే తారతమ్యాలు మరచి అందరూ కలిసి సరదాగా జరుపుకునేది హోలీ. తీపి, చేదును కలిపి పంచిపెట్టే విందుల పందిరి హోలీ. ఆనందమే ఆకాశమై, అత్యుత్సాహంతో చేసే అల్లరే ఈ హోలీ. స్నేహితులు, ప్రేమికులకు మరో వసంతం ఈ హోలీ. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

13. A Colorful message to a colorful person for colorful day in a colorful way. as a pray that the colorful ray, may forever stay. happy Holi.

14. Happy Holi. May the Festival of Colors Brighten Your Life with Love and Joy.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News