E-Paper
Advertisement

ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!

ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!
Advertisement

Prayagraj Marriage: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. గత 15 ఏళ్లుగా తనకు రాఖీ కడుతూ సోదరుడిగా భావించిన యువకుడినే ఒక యువతి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి రెండు కుటుంబాల మధ్య తీవ్ర వివాదానికి దారితీయడమే కాకుండా.. యువతి బతికుండానే తండ్రి కర్మకాండలు నిర్వహించే స్థాయికి వెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే..

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 20 ఏళ్ల నందిని పాండే అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల శాశ్వత్ గుప్తాలు సెప్టెంబర్ 20 అర్ధరాత్రి ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనిపై నందిని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాశ్వత్ గత కొన్నేళ్లుగా తమ ఇంటికి క్రమం తప్పకుండా వస్తుండేవాడని, నందిని అతనికి దాదాపు 15 ఏళ్లుగా రాఖీ కడుతోందని యువతి తల్లి తెలిపింది. అతడిని సొంత కొడుకులా చూసుకున్నామని వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే విషయం తమకు అస్సలు తెలియదని కన్నీరు పెట్టుకుంది. అయితే శాశ్వత్ తమ కుమార్తెను మాయమాటలతో లోబరుచుకున్నాడని.. ఇంట్లో ఉన్న రూ.2 లక్షలతో తమ కుమార్తె పారిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రేమించే పెళ్లి చేసుకున్నాం: నందిని

Advertisement

కుటుంబ సభ్యుల ఆరోపణలను నందిని పాండే పూర్తిగా ఖండించింది. పెళ్లి తర్వాత ఆమె ఒక వీడియోను విడుదల చేస్తూ.. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ప్రేమవివాహం చేసుకున్నామని స్పష్టం చేసింది. తాను స్వచ్ఛందంగానే ఇల్లు వదిలి వచ్చానని, ఇంట్లో రూ. 2 లక్షలు తీసుకువెళ్లాననడంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. పైగా గత కొంతకాలంగా తన తండ్రి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని.. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించలేదని ఆరోపించింది. ప్రస్తుతం తన భర్త, అత్తమామలే తనకు అండగా ఉండి వైద్యం చేయిస్తున్నారని తమను ఎవరూ వేధించవద్దని ఆమె వీడియోలో వేడుకుంది.

Also Read: 1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

బతికుండగానే అంత్యక్రియలు..

Advertisement

మరోవైపు తన కూతురి పెళ్లి వార్త తెలియడంతో నందిని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ పరువు తీసిన కూతురు.. తమకు ఇక లేనట్లేనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా బతికుండగానే కూతురుకి అంత్యక్రియలు నిర్వహించారు. నందినితో అన్ని సంబంధాలనూ తెంచుకుంటున్నామని, ఇకపై తమకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. మరోవైపు సదరు యువకుడ్ని చేసుకోవడం వల్ల ఆమె భవిష్యత్తు, భద్రత సమస్యలు వాటిల్లే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. మెుత్తంగా శాశ్వత్, నందిని పెళ్లి.. ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

Tags

Related News

తనిష్క్‌లో 10 కేజీల గోల్డ్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులపై దూకిన కోతి.. ఇద్దరూ మృతి.. ఎలాగంటే

దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ సవాల్!

తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. యజమాని ఇంట్లో సోదాలు!

విడాకుల కోసం భారీగా డబ్బు డిమాండ్ చేసిన భార్య.. ఇచ్చాక మాట తప్పిందని కోర్టుకెక్కిన భర్త

అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన బస్సు, 23 మందికి పైగా మృతి!

మద్యం మత్తులో వేధింపులు.. కత్తితో పొడిచి పొడిచి భర్తను చంపిన భార్య

200 కి.మీ. వేగం.. ఊడిపడిన ఇంజిన్.. ద్వారకా టన్నెల్‌లో భయానక ప్రమాదం!

Big Stories

Advertisement
×