Saudi Arabia: యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఓ విమానంలో ఎమర్జెన్సీ సంకేతాలు వచ్చిన తర్వాత హైజాక్ కోడ్ రావడం తీవ్ర కలకలం రేపింది. సదరు విమానం సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అధికారులు ఆ విమానాన్ని సౌదీలోని తబుక్ సైనిక స్థావరానికి మళ్లింది. వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు. ఈ వ్యవహారం కాస్త పైలట్ల మధ్య జరిగిన ఘర్షణగా తేలింది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానానికి హైజాకింగ్ సంకేతాలు వచ్చాయి. దీంతో సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండయ్యింది. ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం మేరకు.. దుబాయ్‌లో విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలో ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను పంపింది. హైజాక్ అలర్ట్‌తో ప్లై దుబాయ్ విమానం సౌదీ అరేబియాలోని తబుక్ సైనిక స్థావరంలో ల్యాండ్ అయింది.
ఫ్లై దుబాయ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఎమర్జెన్సీకి సంకేతం స్క్వాక్ కోడ్ 7700 ప్రసారం చేసింది. కాసేపటికే హైజాకింగ్ ముప్పును తెలిపే స్క్వాక్ 7500కు మారింది. అయితే చివరకు కాక్ పిట్‌లోని పైలట్ల మధ్య ఘర్షణ వల్ల జరిగిందని తేలింది. ప్రస్తుతం విమానంలోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. పైలట్ల మధ్య వివాదం కారణంగా అత్యవసరంగా విమానం ల్యాండ్ అయ్యిందని నివేదించింది.
కాక్‌పిట్‌లో గొడవ జరిగిందని అందులో పైలట్లు ప్రమేయం ఉందని ఓ అధికారి అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఈ గొడవకు కారణం ఏంటి? అనేది తెలియరాలేదు. పైలట్‌పై విమానంలోని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడని కొందరు ప్రయాణికులు చెప్పినట్టు ఇజ్రాయెల్ మీడియా రాసుకొచ్చింది. సదరు వ్యక్తిని పట్టుకోడానికి ప్రయాణికులు విమాన సిబ్బందికి సహాయపడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు రాత్రి 1.20 గంటల సమయంలో విమానం భూమికి 34 వేల అడుగుల ఎత్తు నుంచి 16,600 అడుగులు దిగువకు వచ్చేసింది.
ALSO READ: భారతీయులకు ట్రంప్ సర్కార్ షాక్.. EB-5 గ్రీన్‌కార్డ్ ఫీజులు భారీగా, నవంబర్ నుంచి అమల్లోకి
ఇది జరిగిన 10 నిమిషాలకు విమానం నుంచి మొదటి ఎమర్జెన్సీ సంకేతం వచ్చింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది తమ పౌరులు ఉండడంతో విమానం హైజాక్‌కు గురైందేమోనన్న భయంతో యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది ఇజ్రాయెల్.