E-Paper
Advertisement

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!
Advertisement

Amami Mongoose: ఒక చిన్న పొరపాటు ఎంతటి పర్యావరణ వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి జపాన్‌లోని ‘అమామి ఓషిమా’ దీవిలో జరిగిన సంఘటనే ఉదాహరణ. పాములు, ఎలుకల బెడద వదిలించుకోవడానికి తెచ్చిన ముంగిసలు.. ఆ దీవిలోని అరుదైన జీవుల ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి. ఐదు దశాబ్దాల సుదీర్ఘ శ్రమ, అధునాతన సాంకేతికత, వందల కోట్ల ఖర్చు తర్వాత ఎట్టకేలకు ఆ దీవి నుంచి ముంగిసలను పూర్తిగా తరిమేసి పర్యావరణ వ్యవస్థను జపాన్ కాపాడుకోగలిగింది.

అసలేం జరిగిందంటే?

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అమామి ఓషిమా దీవిలో ‘అమామి కుందేలు’, ‘అమామి ముళ్ల ఎలుక’, ‘ఇషికావా కప్పలు’ వంటి ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన ప్రాణులు ఉన్నాయి. అయితే ఇక్కడి విషపూరితమైన ‘హాబు’ పాములు వాటి మనుగడకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో అరుదైన ఎలుకలను పాముల నుంచి కాపాడేందుకు 1979లో ‘అమామి ఓషిమా’ దీవికి 30 చిన్నపాటి భారతీయ ముంగిసలను (Small Indian Mongooses) అధికారులు వదిలారు.

దారుణంగా విఫలమైన ప్రయోగం..

Advertisement

అయితే దీవిలో ముంగిసలను ప్రవేశపెట్టే ప్రయోగం దారుణంగా విఫలమైంది. హాబు పాములు రాత్రివేళల్లో తిరిగితే ముంగిసలు పగటిపూట వేటాడటం ప్రారంభించాయి. దీంతో పాములను వేటాడటం వదిలేసి, ముంగిసలు దీవిలోని అమాయక అరుదైన కుందేళ్లు, కప్పలు, ఇతర జీవులను చంపి తినడం మొదలుపెట్టాయి. చూస్తుండగానే ముంగిసల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి.. స్థానిక జీవుల ఉనికికే ప్రమాదకరంగా మారాయి.

30 నుంచి 10 వేలకు పెరుగదల

1990ల నాటికి ఆ 30 ముంగిసల సంఖ్య ఏకంగా 10,000కు చేరుకుంది. అవి దీవిలోని అడవులంతటా విస్తరిస్తున్న కొద్దీ అరుదైన స్థానిక ప్రాణుల సంఖ్య వేగంగా పడిపోయింది. దీంతో 1996 నుంచి జపాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి పరిస్థితి తీవ్రతను అధ్యయనం చేసింది. 2000 సంవత్సరం నుంచి భారీ ఎత్తున వాటిని నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టింది.

ముంగిసల ఏరివేతకు ప్రత్యేక చట్టం

Advertisement

2005లో జపాన్ ప్రభుత్వం ‘అతిక్రమణ విదేశీ జీవుల చట్టం’ తీసుకొచ్చి ముంగిసల ఏరివేతకు మార్గం సుగమం చేసింది. దీంతో ‘అమామి ముంగిస బస్టర్స్’ (Amami Mongoose Busters) అనే ప్రత్యేక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీవి అంతటా 35,000కు పైగా బోన్లు, 500కు పైగా ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలను రప్పించి ముంగిసల జాడ కనిపెట్టారు.

ఆరేళ్ల శ్రమ.. ఎట్టకేలకు ఫలితం

తీవ్ర ప్రయత్నాల తర్వాత 2018 ఏప్రిల్‌లో చివరి ముంగిస బోనులో చిక్కింది. అయితే అమామి ఓషిమా పెద్దది, పర్వతాలతో కూడుకున్నది కావడంతో ముంగిసలు పూర్తిగా అంతరించాయని వెంటనే ప్రకటించలేదు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు ఒక్క ముంగిస కూడా కెమెరాలకు చిక్కలేదు, కుక్కలకూ దొరకలేదు. వివిధ గణాంకాల నమూనాలు ఉపయోగించి దీవిలో ఒక్క ముంగిస కూడా మిగల్లేదని నిర్ధారించుకున్న తర్వాత.. 2024 సెప్టెంబర్ 3న జపాన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అమామి ఓషిమా దీవి ముంగిసల బారిన పడకుండా పూర్తిగా విముక్తమైందని అధికారికంగా ప్రకటించింది.

Also Read: అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

అరుదైన జీవజాలంకు మళ్లీ ప్రాణం

ముంగిసల ముప్పు తొలగిపోవడంతో అమామి ఓషిమా దీవిలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయి. అంతరించిపోతాయనుకున్న అమామి కుందేళ్లు, ముళ్ల ఎలుకలు, అరుదైన కప్పల సంఖ్య మళ్లీ పెరుగుతోందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతర పర్యావరణ సవాళ్ల నుంచి ఈ సున్నితమైన జీవులను కాపాడుకోవడానికి ఇంకా కృషి చేయాల్సి ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!

Tags

Related News

వాటర్ ఫాల్స్ కాదు బ్లడ్ ఫాల్స్.. రక్తం ప్రవహించే ఈ ప్రదేశం ఎక్కడుందంటే?

టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

Big Stories

Advertisement
×