E-Paper
Advertisement

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!
Advertisement

India’s Most Luxurious Train Journeys: రైలు అంటే చాలామందికి గుర్తొచ్చేది సీట్లు, బెర్తులు, స్టేషన్లు, కిటికీ బయట కనిపించే ప్రకృతి దృశ్యాలు. కానీ. దేశంలోని కొన్ని రైళ్లు మాత్రం ఈ సాధారణ ప్రయాణానికి పూర్తిగా భిన్నం. రైలులోనే విలాసవంతమైన గదులు, రెస్టారెంట్లు, బార్లు, ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. కదులుతున్న రైలులోనే ఓ లగ్జరీ హోటల్ అనుభూతిని అందిస్తాయి. వాటిలో ప్రయాణం చేయడం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదు.. ప్రయాణాన్నే ఓ ప్రత్యేక అనుభవంగా మార్చుకోవడం.

మహారాజాస్ ఎక్స్‌ ప్రెస్.. రైలులోనే రాజసం!

దేశంలోని ప్రముఖ లగ్జరీ రైళ్లలో మహారాజాస్ ఎక్స్‌ ప్రెస్ ఒకటి. పేరు చెప్పినట్టుగానే ఇందులో రాజరిక శైలిని గుర్తు చేసే వాతావరణం కనిపిస్తుంది. వివిధ రత్నాల పేర్లతో కోచ్‌లను తీర్చిదిద్దారు. ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ లాంటి విలాసవంతమైన వసతి కూడా ఉంది. ప్రయాణికుల కోసం ప్రత్యేక డైనింగ్ సదుపాయాలు, రెస్టారెంట్లు, బార్ అందుబాటులో ఉంటాయి. సాధారణ రైలు ప్రయాణానికి భిన్నంగా.. ఇక్కడ ప్రయాణమే ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ప్యాలెస్ ఆన్ వీల్స్.. కదిలే రాజభవనం!

Advertisement

1982లో ప్రారంభమైన ఈ రైలు రాజస్థాన్‌ లోని రాజరిక వారసత్వాన్ని ప్రయాణ అనుభవంతో కలిపి అందిస్తుంది. రాజభవనాలను తలపించే ఇంటీరియర్, ప్రత్యేక ఆతిథ్యం, రెడ్ కార్పెట్ స్వాగతం లాంటి అంశాలు ఈ రైలుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. రాజస్థాన్‌ లోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

దక్కన్ ఒడిస్సీ.. చరిత్ర నడుమ లగ్జరీ జర్నీ!

దక్కన్ ఒడిస్సీ మరో పాపులర్ లగ్జరీ రైలు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను కలుపుతూ వివిధ ప్రయాణ ప్యాకేజీలను అందిస్తుంది. రైలులోనే సౌకర్యవంతమైన వసతి, భోజన సదుపాయాలు, ఇతర విలాసవంతమైన సేవలు ఉండటంతో ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతి లభిస్తుంది. బయట కనిపించే చారిత్రక కట్టడాలు, ప్రకృతి దృశ్యాలతో పాటు రైలులోని వాతావరణం కూడా ప్రయాణంలో భాగమవుతుంది.

గోల్డెన్ చారియట్.. దక్షిణాది చారిత్రక అనుభూతి

Advertisement

దక్షిణ భారతదేశంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాంతాలను పరిచయం చేసే లగ్జరీ రైలు గోల్డెన్ చారియట్. కర్ణాటక సహా దక్షిణాదిలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కవర్ చేసే ప్రయాణ ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. రైలులో సౌకర్యవంతమైన గదులు, డైనింగ్ సదుపాయాలు, ఇతర హాస్పిటాలిటీ సేవలు ఉంటాయి. అంటే ఒకవైపు ప్రయాణం సాగుతుండగా.. మరోవైపు హోటల్ తరహా వసతి కూడా అందుతుంది.

ఇంత లగ్జరీకి ధర ఎంత?

ఈ రైళ్లలో ప్రయాణ ఖర్చు సాధారణ రైళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యాకేజీ, ప్రయాణ తేదీలు, రూట్, గదుల ప్రత్యేకతను బట్టి   ధర మారుతుంది. ఒక్కో ప్యాకేజీలో ఒక్కో ప్రయాణికుడికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కొన్ని ప్యాకేజీల ధరలు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా కూడా ఉంటాయి.

Read Also: టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

Tags

Related News

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

వాటర్ ఫాల్స్ కాదు బ్లడ్ ఫాల్స్.. రక్తం ప్రవహించే ఈ ప్రదేశం ఎక్కడుందంటే?

టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

Big Stories

Advertisement
×