E-Paper
Advertisement

బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!

బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!
Advertisement

Begging Experiment: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పండగల వేళ బిచ్చగాళ్లు ఎంత సంపాదిస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకోవడానికి యూట్యూబర్ పురుషోత్తమ్ వశిష్ట్.. ఆయన స్నేహితుడు సచిన్ ఒక వినూత్న ప్రయోగం చేశారు. హరిద్వార్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే కాన్వడ్ మేళాలో సచిన్ భిక్షగాడి అవతారం ఎత్తారు. వేషధారణ మార్చుకుని దాదాపు 8 గంటల పాటు భిక్షాటన చేశాడు. చివరికి లెక్కించగా ఏకంగా రూ.4,000 వసూలవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

డిజిటల్ క్యూఆర్ కోడ్.. కళ్లద్దాల గిఫ్ట్

బిచ్చగాడిలా కనిపించేందుకు సచిన్ చిరిగిన దుస్తులు ధరించి చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకుని భక్తుల వద్దకు వెళ్లాడు. ప్రత్యేకంగా తన మెడలో ‘యూపీఐ క్యూఆర్ కోడ్ (UPI QR Code)’ బోర్డు తగిలించుకోవడం విశేషం. దీని ద్వారా డిజిటల్ పేమెంట్ల రూపంలోనే రూ.40 వరకు జనం పంపారు. తోపుడు బళ్ల వద్ద తిరుగుతున్న సమయంలో ఒక సన్ గ్లాసెస్ వ్యాపారి.. సరదాగా అతనికి ఒక కళ్లద్దాల జతను బహుమతిగా ఇచ్చాడు. తోటి భిక్షగాళ్లతో మాట్లాడినప్పుడు వారు తమ పేర్లు, ఊళ్లు కూడా మరచిపోయి జీవిస్తున్న దారుణ పరిస్థితులను సచిన్ గమనించాడు.

గంటకు రూ.500 చొప్పున ఆదాయం

Advertisement

ప్రయోగం ప్రారంభంలో మొదటి నాలుగు గంటల్లో రూ.800 మాత్రమే సచిన్ కు బిక్షగా వచ్చాయి. అయితే సమయం గడిచేకొద్దీ కాన్వడ్ మేళాలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా ఒక్కసారిగా పెరిగింది. వర్షం పడుతున్నా, సెక్యూరిటీ గార్డులు తారసపడి విసిగించినా.. సచిన్ భిక్షాటన కొనసాగించాడు. చివరికి తను నిర్దేశించుకున్న 8 గంటల సమయం ముగిసేసరికి రూ.4,000 అతనికి వచ్చాయి. అంటే సగటున గంటకు రూ.500 సంపాదించినట్లయింది. ఇదే లెక్కన రోజుకు 8 గంటలు చేస్తే నెలకు రూ.1.2 లక్షలు, ఒకవేళ 12-13 గంటలు శ్రమిస్తే నెలకు రూ.2.4 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించవచ్చని సచిన్ అంచనా వేశాడు.

డబ్బులు వచ్చినా.. భిక్షాటన దారుణం

ఎక్కువ డబ్బులు వచ్చినంత మాత్రాన భిక్షాటన సులువైన పని కాదని ఆ యూట్యూబర్లు స్పష్టం చేశారు. రోజంతా కాళ్లకు పనిచెప్పి, దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడటం మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురిచేస్తుందని చెప్పారు. కొందరు ఆప్యాయంగా సహాయం చేసినా.. మరికొందరు దారుణంగా తిట్టిపోశారని, కనీసం మనుషులుగా కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి గౌరవప్రదమైన మార్గాల్లోనే డబ్బు సంపాదించాలని.. భిక్షాటనా మార్గాన్ని ఎవరూ ఎంచుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: తిరుమలలో హైటెక్ గస్తీ.. రంగంలోకి రోబోటిక్ డాగ్.. మెట్లమార్గంలో చిరుతలకు చెక్!

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

బిక్షాటన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో భిక్షాటన వెనుక పెద్ద మాఫియా నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం ఒక్కరోజు ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన భిక్షగాళ్ల జీవితాలను తక్కువ చేసి చూడలేమని అభిప్రాయపడ్డారు. వైకల్యం, తీవ్రమైన పేదరికం, అనారోగ్యం వల్ల వేరే దారిలేక అడుక్కునే వారి పరిస్థితి వేరని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×