E-Paper
Advertisement

కన్నుమూసిన షావుకారు జానకి.. స్పందిస్తున్న సెలబ్రిటీలు!

కన్నుమూసిన షావుకారు జానకి.. స్పందిస్తున్న సెలబ్రిటీలు!
Advertisement

Sowcar Janakiఏడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు విశేష సేవను అందించి.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో ఏకంగా 400కు పైగా చిత్రాలలో నటించి, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ మధ్యకాలంలో బామ్మగా కూడా మెప్పించిన షావుకారు జానకి కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ముఖ్యంగా నాలుగు తరాల నటీనటులతో నటించిన ఘనత ఈమె సొంతం. అంతేకాదు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఐసీయూలో వెంటిలేటర్ కింద చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:59 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈమె మరణాన్ని సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

also read:ఇండస్ట్రీలో విషాదం.. షావుకారు జానకి కన్నుమూత!

షావుకారు జానకి మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం..

Advertisement

షావుకారు జానకి మరణించారు అన్న వార్త సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న షావుకారు జానకి ఇక లేరన్న విషయం తెలియగానే.. సీనియర్ ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. “తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణ వార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ తెలియజేశారు.

షావుకారు జానకి మృతిపై మంచు విష్ణు సంతాపం..

Advertisement

“షావుకారు జానకి గారి మరణ వార్త విని తీవ్రంగా దుఃఖిస్తున్నాను. ఆమె హుందాతనం, గౌరవం, అద్భుతమైన కార్యక్షేత్రాలు తరతరాల పాటు నిలిచి ఉంటాయి. నేటి యువతరం ఆమె ఎంతటి దిగ్గజం అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ సంతాపం తెలియజేశారు.

షావుకారు జానకి మృతిపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి..” ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇక లేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘ షావుకారు ‘ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు 7 దశాబ్దాల పాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం.

షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

 

 

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×