E-Paper
Advertisement

పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? రాశీ సింగ్ కామెంట్స్ వైరల్

పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు?  రాశీ సింగ్ కామెంట్స్ వైరల్
Advertisement

Rashi Singh on Age Gap in Relationships:వయసు తక్కువ ఉన్న వాళ్ళని కాకుండా ఎక్కువ వయసున్న వాళ్ళనే అమ్మాయిలు ఇష్టపడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి రాశి సింగ్.తెలుగులో శశి సినిమాతో ఎంట్రీ ఇచ్చి,ప్రసన్న వదనం, భూతద్దం భాస్కర్ నారాయణ,ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు వంటి సినిమాలతో అలరించిన ఆ చత్తీస్ గడ్ బ్యూటీ తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన రంభ ఊర్వశి మేనక సినిమాతో మరోసారి మనల్ని పలకరించేందుకు సిద్దం అయ్యింది.

ఇక ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 4న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ తో హోరెత్తిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

పెద్దవారినే ఎందుకు ఇష్టపడతామంటే 

Advertisement

ప్రస్తుతం ఉన్న జనరేషన్ అమ్మాయిలు ఏజ్ లో పెద్దవారినే ఎక్కువగా ఎందుకు ఇష్టపడుతున్నారు అన్న ప్రశ్నకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ.ప్రస్తుతం అబ్బాయిల కన్నా అమ్మాయిలే మెంటల్ గా ఫాస్ట్ గా మెచ్యూర్ అవుతున్నరని తన అభిప్రాయాన్ని తెలిపింది.ఏజ్ పరంగా సేమ్ ఉన్నప్పటికీ మెచ్యూరిటీ పరంగా తేడా లు ఉండటం వల్ల ఇద్దరి మధ్య గొడవలు రావడం సహజమని అందుకే వయసు తమ కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వారైతే వారికి మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుందని దాని వల్ల తమని ఈజీగా అర్థం చేసుకుంటారని తెలిపింది.

ఆ విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్

అమ్మాయిలకు కేవలం అబ్బాయి అందంగా ఉన్నాడా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడా అనేది మాత్రమే సరిపోదని, వారితో ఉంటే ఎంత సేఫ్‌గా అనిపిస్తుంది, మానసికంగా ఎంత ప్రశాంతత లభిస్తుంది, కష్ట సుఖాల్లో ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనే విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అసలు విషయం చెప్పుకొచ్చింది.

Advertisement

ఇదే క్రమంలో రాశి సింగ్ మాట్లాడుతూ రోజంతా బయట రకరకాల పనులతో, ఒత్తిళ్లతో విసిగిపోయి ఇంటికి వచ్చినప్పుడు మనల్ని అర్థం చేసుకుని, ఆప్యాయంగా పలకరించే లైఫ్ పార్టనర్ ఒకరుండాలి అని ఎవరైనా కోరుకుంటారు.
కానీ ఇంటికి వచ్చాక కూడా అబ్బాయిని ఒక చిన్న పిల్లాడిలా చూసుకోవాల్సి వస్తే ఆ అమ్మాయికి పార్ట్‌నర్‌లా కాకుండా ఒక అమ్మలా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని. ఒక రిలేషన్‌షిప్‌లో అలా మారాల్సి వస్తే ఆ సంబంధానికి అస్సలు మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ఈ మార్పులు ఇప్పుడేమీ ఉన్న పళంగా రాలేదని,గత పది ఇరవై ఏళ్లలో అమ్మాయిల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. మంచి చదువు, సొంతంగా సంపాదించుకునే కెరీర్, బయట ప్రపంచంలో తిరగడం వల్ల అమ్మాయిల్లో స్వేచ్ఛ, సొంతంగా ఆలోచించడం పెరిగిందని, దీనివల్ల రిలేషన్‌షిప్స్ విషయంలో కూడా వారి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని తన అభిప్రాయాన్ని తెలిపింది రాశీ సింగ్.

అదే అసలైన విషయం

ఇక ముప్పై ఐదు లేదా నలభై ఏళ్లు దాటిన మహిళలు తమకంటే చిన్న వయసు ఉన్న అబ్బాయిలను ఇష్టపడటం గురించి మాట్లాడుతూ అసలిక్కడ ఏజ్ అనేది మ్యాటరే కాదని ఇద్దరి మధ్య ఉండే అండర్‌స్టాండింగ్, ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ముఖ్యం. వయసు చిన్నదా పెద్దదా అనే దానికంటే ఒకరినొకరు ఎంత గౌరవించుకుంటున్నారు, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు అనేదే అసలైన విషయం అని చెప్పుకొచ్చింది.

also read :కమిట్‌మెంట్ లేకుండా అవకాశాలు రావా..? ‘భాగ్య రేఖ’ఐశ్వర్య ఏం చెప్పిందంటే!

ఇక రాశి సింగ్ విషయానికి వస్తే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆమె మొదట ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింద. నటనపై ఉన్న ఇష్టంతో ఆ ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చేసిన రాశి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడిపేస్తుంది.

Tags

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×