E-Paper
Advertisement

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష
Advertisement

Ahmedabad Serial Blasts Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది గుజరాత్ హైకోర్టు. ఈ కేసులో 38 మందికి మరణశిక్ష విధించింది. మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నాలుగేళ్ల కిందట ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు:  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు. ఈ కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది గుజరాత్ హైకోర్టు. ఉగ్రవాద దాడికి పాల్పడిన 38 మంది నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది.

Advertisement

గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష: దేశ న్యాయ చరిత్రలో ఒక కేసులో భారీ సంఖ్యలో మరణశిక్షలు ఖరారు కావడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల కిందట అంటే 2022లో ఈ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. అందులో 38 మందికి మరణశిక్ష కాగా, మరో 11 మందికి జీవిత ఖైదు విధించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో కింది కోర్టును సవాల్ చేస్తే నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఆయా పిటిషన్లపై విచారణ జరిపింది హైకోర్టు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. చివరకు అన్ని పిటిషన్లను కొట్టివేసింది. జస్టిస్ కొగ్జే-జస్టిస్ సమీర్ దవేలతో కూడిన ధర్మాసనం రెండున్నరేళ్లుగా దాదాపు 250 సార్లు అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపింది.

Advertisement

నష్టపరిహారం వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశం:  మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఇండియన్ ముజాహిదీన్-సిమిలకి చెందిన ఉగ్రవాదులు దారుణమైన దాడులకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో బలంగా నిరూపించింది. నిందితులపై దేశద్రోహం, హత్య నేరాలు, ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద మోపిన అభియోగాలను న్యాయస్థానం సమర్థించింది.

అసలు ఏం జరిగింది? 2008న జులై 26న అహ్మదాబాద్ సిటీ‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కేవలం గంటా 10 నిమిషాల సమయంలో ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. మార్కెట్లు, సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రమూకలు రెండో విడతలుగా బాంబులు పేల్చారు.

ALSO READ: PM మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం.. భారతీయులందరికీ దక్కిన గౌరవమంటూ మోదీ భావోద్వేగం!

ఈ ఘటనలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీర్పుతోపాటు బాధితులకు ఉపశమనం కలిగేలా కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని అందులో ప్రస్తావించింది.

నార్మల్‌గా గాయపడిన వారికి లక్ష చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సూచించింది. నష్టపరిహార ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి చివరినాటికి పూర్తి చేయాలని గడువు విధించింది గుజరాత్ హైకోర్టు.

Related News

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. 38 మందికి మరణ శిక్ష.. అసలేం జరిగింది?

Ketan Agarwal Case: కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నాలుగు నెలల ముందే, సియా ఆ పని చేసిందా?

PM మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం.. భారతీయులందరికీ దక్కిన గౌరవమంటూ మోదీ భావోద్వేగం!

Admissions: జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు.. 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

అయోధ్యలో రూ. 5 కోట్ల బంగారు పుస్తకం మాయం? అసలు నిజం బయటపెట్టిన రామాలయ ట్రస్ట్

పోలీసోడి పాడు బుద్ధి.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి డ్రైవర్‌కే కన్నం! ఖాకీ పవర్ చూపించినా వదలకుండా..!

ఫోన్ చాటింగ్ చిచ్చు.. ప్రియురాల్ని చంపి ముక్కలు చేసిన ప్రియుడు, ఆ తర్వాత ఏం చేశాడంటే

Big Stories

Advertisement
×