BigTV English

Mouni Roy: అర్ధరాత్రి, నా హోటల్ రూమ్‌లో ఆ వ్యక్తి.. చేదు అనుభవం చెబుతూ వణికిపోయిన నటి

Mouni Roy: అర్ధరాత్రి, నా హోటల్ రూమ్‌లో ఆ వ్యక్తి.. చేదు అనుభవం చెబుతూ వణికిపోయిన నటి

Mouni Roy: సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు వెలిగిపోతున్న ఆడవారికి చేదు అనుభవాలు ఎదురవ్వడం చాలా కామన్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలోనే కాదు.. ప్రేక్షకుల దగ్గర నుండి ఈ నటీమణులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలాంటి అనుభవాలను వారు జీవితాంతం మర్చిపోలేరు. ఫ్యాన్స్ అంటూ దగ్గరకు వచ్చిన అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు. కొందరు అభిమానం పేరుతో హీరోయిన్స్‌తో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. అలా తాజాగా ఒక బాలీవుడ్ నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఒణికిపోయింది. తను మరెవరో ఒకప్పుడు బుల్లితెరపై తన సత్తా చాటుకొని ఇప్పుడు వెండితెరపై బిజీ అయిపోయిన మౌనీ రాయ్.


చేదు అనుభవం

ముందుగా బుల్లితెరపై సీరియల్స్‌తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది మౌనీ రాయ్. ‘నాగిన్’ అనే సీరియల్ మౌనీ రాయ్ కెరీర్‌నే మలుపు తిప్పింది. దానివల్ల తను బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. అలా మౌనీ రాయ్‌కు వెండితెరకు కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు పలు ఐటెమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. అలా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న మౌనీ రాయ్.. చాలానే ఫ్యాన్ బేస్‌ను కూడా సంపాదించుకుంది. ఒకానొక సందర్భంలో తన అభిమాని వల్ల తను ఎదుర్కున్న ఇబ్బంది గురించి తాజాగా బయటపెట్టింది మౌనీ.


గట్టిగా అరిచాం

‘‘నేను అప్పుడు ఒక చిన్న ఊరిలో ఉన్నాను. అది ఏ ఊరు అని కూడా నాకు గుర్తులేదరు. కానీ నేను హోటల్‌లో ఉన్నప్పుడు ఆ రూమ్ తాళంచెవిని దొంగలించి ఒక వ్యక్తి నా రూమ్‌లోకి చొరబడడానికి ప్రయత్నించాడు. దేవుడి దయ వల్ల అప్పుడు నేను ఒంటరిగా లేను. నా మ్యానేజర్ కూడా నాతోనే ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో తెలియగానే వెంటనే మేము అరవడం మొదలుపెట్టాం. వెంటనే రిసెప్షన్‌కు ఫోన్ చేశాం. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యిండొచ్చని చెప్పి ఏమీ పట్టించుకోకుండా మామూలుగా ఫోన్ పెట్టేశారు. హౌస్ కీపింగ్ వాళ్లు కనీసం డోర్ కొట్టకుండా, బెల్ కొట్టకుండా, అర్థరాత్రి 12.30 గంటలకు ఎందుకు వస్తారు’’ అని అడిగాను అని వివరించింది మౌనీ రాయ్ (Mouni Roy).

Also Read: అయిదేళ్ల క్రితం నమోదయిన కేసు.. ఎట్టకేలకు సీనియర్ నటికి ఊరట

అస్సలు పట్టించుకోలేదు

‘‘ఇంత జరుగుతున్నా కూడా హోటల్ స్టాఫ్ మాత్రం ఏమీ పట్టించుకోనట్టు వ్యవహరించారు. అలా అయితే వచ్చే గెస్టులకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది’’ అంటూ ప్రశ్నించింది మౌనీ రాయ్. ప్రస్తుతం మౌనీ రాయ్ తన తరువాతి సినిమా రిలీజ్ విషయంలో బిజీగా ఉంది. ఇప్పటికే తన తరపున ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ‘భూతిని’ అనే హారర్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది మౌనీ రాయ్. ఇందులో మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించనుంది. ఇందులో మౌనీ రాయ్‌తో పాటు సంజయ్ దత్ లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు. మే 1న ఎన్నో సినిమాల మధ్య ‘భూతిని’ కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×