OTT Movie : 1990లలో గోవాలో, ఒక నిజాయితీ గల కస్టమ్స్ ఆఫీసర్ ఒక భారీ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ ను పట్టుకోవానికి ప్రాణాలను పణంగా పెడతాడు. కానీ ఒక ఊహించని సంఘటన అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. అతను ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ ఆఫీసర్ ఎవరు? అతని నిజాయితీ అతన్ని రక్షిస్తుందా? లేక సిస్టమ్ అతన్ని నలిపేస్తుందా? ఈ రహస్యం వెనుక దాగిన సత్యం ఏమిటి? అనే విషయాలతో పాటు ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
కోస్టావో… 1979లో గోవా కస్టమ్స్‌లో ప్రివెంటివ్ ఆఫీసర్‌గా చేరి, 1990ల నాటికి గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ లకు వ్యతిరేకంగా, ధైర్యంగా పోరాడే ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అతను తన భార్య మరియా (ప్రియా బాపట్), కొడుకు క్రిస్ (అబీర్ జైన్), కూతురు మరిస్సా (అస్మి డియో)తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ అతనిపై పడే నింద కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక రహస్య సమాచారం ఆధారంగా, కోస్టావో 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్ ను పట్టుకునే ఆపరేషన్ లో భాగంగా ఒక బీచ్ కు వెళతాడు.
అక్కడ అతను పీటర్ డి’మెల్లో (హుస్సేన్ దలాల్) అనే స్మగ్లర్, పవర్ ఫుల్ రాజకీయవేత్త, అతని సోదరుడిని గోల్డ్ తో పారిపోతుండగా చూస్తాడు. అయితే వాళ్ళను పట్టుకునే క్రమంలో ఒక ఘర్షణ జరుగుతుంది. కోస్టావో ఆత్మరక్షణలో భాగంగా పీటర్ ను చంపేస్తాడు. ఈ అనుకోని ఘటన అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. పీటర్ సోదరుడు డి’మెల్లో (కిషోర్ కుమార్ జి) ఒక ప్రముఖ స్మగ్లర్, పొలిటీషియన్ కూడా.
నిజాయితీకి మారుపేరు అయిన కోస్టావోపై తన బ్రదర్ ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి సిస్టమ్ ను ఉపయోగిస్తాడు, అతన్ని హత్య కేసులో ఇరికిస్తాడు. కోస్టావో ఈ కేసులో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాడు. ఇది అతని కుటుంబ జీవితాన్ని కూడా దెబ్బతీస్తుంది. మరి ఆ నిజాయితీ గల ఆఫీసర్ ఈ కేసు నుంచి ఎలా బయట పడ్డాడు? నిజాయితీ గల ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్న కోస్టావోపై అతని స్వంత డిపార్ట్మెంట్ ఎలా తిరగబడింది? ఈ మచ్చను చెరిపేసుకోవడానికి ఆయన ఏం చేశాడు? దీని వల్ల వాళ్ళ కుటుంబం ఎంత స్ట్రగుల్ అయ్యింది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : స్విమ్మింగ్ పూల్ లో ఇరుక్కుపోయే అక్కాచెల్లెళ్ళు … స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్
ఓటీటీలో ట్రెండింగ్ లో…
Costao అనేది 1990లలో గోవాలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా. కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెస్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) జీవితాన్ని తెరపై చిత్రీకరించారు. 2025 లో రిలీజ్ అయిన ఈ మూవీ ZEE5 లో అందుబాటులో ఉంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ, ప్రియా బాపట్, కిషోర్ కుమార్ జి, హుస్సేన్ దలాల్, అస్మి డియో ప్రధాన పాత్రలు పోషించారు. సెజల్ షా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది. నవాజుద్దీన్ సిద్దిఖీ పవర్ ఫుల్ నటన, సెజల్ షా రియలిస్టిక్ డైరెక్షన్, రఫీ మహమూద్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని ఒక గ్రిప్పింగ్ బయోపిక్‌గా మార్చాయి. ఇంకా చూడకపోతే వెంటనే ఈ క్రైమ్ థ్రిల్లర్ పై ఓ లుక్కేయండి.