OTT Movie : అప్పుడప్పుడూ అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు చూస్తే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంతమంది మనిషి రూపంలో ఉన్న మృగాళ్లు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడంతో పాటు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీని చూశాక, అమ్మాయిల్ని పొరపాటున కూడా ఒంటరిగా వదలరు పేరెంట్స్. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో…
‘3096 డేస్’ (3096 Days) మూవీ 2013లో విడుదలైన జర్మన్ డ్రామా. షెర్రీ హోర్మాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆస్ట్రియన్ అమ్మాయి నటాషా కంపుష్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఆమెను 10 సంవత్సరాల వయస్సులో కిడ్నాప్ చేసి, 8 సంవత్సరాల పాటు (3096 రోజులు) బందీగా ఉంచారు. నటాషా పాత్రలో నార్తర్న్ ఐరిష్ నటి ఆంటోనియా కాంప్‌బెల్-హ్యూస్, కిడ్నాపర్ వోల్ఫ్‌గాంగ్ ప్రిక్లోపిల్ పాత్రలో థూరే లిండ్‌హార్ట్ నటించారు. ఈ చిత్రం నటాషా రాసిన ఆత్మకథ ‘3,096 డేస్’ (2010) ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమాను చూడవచ్చు.
కథలోకి వెళ్తే
1998 మార్చి 2వ తేదీ ఉదయం… వియన్నాలో నివసించే 10 సంవత్సరాల నటాషా కంపుష్ తన తల్లితో గొడవ తర్వాత ఒంటరిగా స్కూలుకు నడిచి వెళ్తుంది. తల్లిదండ్రులతో సంతోషంగా లేకపోవడంతో, డిప్రెషన్ లో ఆమె అతిగా తింటుంది. ఆ రోజు 35 ఏళ్ల టెక్నీషియన్ వోల్ఫ్‌గాంగ్ ప్రిక్లోపిల్ ఆమెకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేస్తాడు. నటాషా కళ్ళు తెరిచి చూసేసరికి, ఆస్ట్రియాలోని స్ట్రాస్‌హోఫ్‌లోని ప్రిక్లోపిల్ ఇంటి గ్యారేజీ కింద ఒక చిన్న, సౌండ్ ప్రూఫ్ సెల్లార్‌లో బందీగా ఉన్నాను అనే విషయాన్ని గ్రహిస్తుంది.
విచిత్ర స్వభావం ఉన్న ఒంటరి వ్యక్తి వోల్ఫ్‌గాంగ్… నటాషాను బందీగా ఉంచి తన ఒంటరితనాన్ని అధిగమించాలని భావిస్తాడు. అతను నటాషాకు కఠినమైన రూల్స్ పెట్టి, ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తాడు. మొదట్లో ఆమెకు బొమ్మలు, బట్టలు, ఆహారం అందిస్తాడు. కొన్నేళ్ళ తరువాత ఆమెపై అఘాయిత్యం కూడా చేస్తాడు. ఇక ఆ పాప వీడి టార్చర్ కు ఎంతగా కుంగిపోతుంది అంటే… ఒకసారి ఆమెను ఒక హార్డ్‌వేర్ స్టోర్‌కు తీసుకెళ్తాడు. కానీ కనీసం హెల్ప్ అడగలేకపోతుంది ఆ అమ్మాయి.
Read Also : ఈ డెవిల్ పిల్లాడిని పెంచుకుంటే కోట్లకు పడగలు… పొరపాటున ఆ ఒక్క తప్పు చేస్తే మాత్రం ఫసక్కే
నటాషా తనకు జరిగిన దారుణాన్ని టాయిలెట్ పేపర్‌పై రాసి, ఒకానొక సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. కానీ అది వర్కౌట్ కాదు. ఇక ఆమె 18వ పుట్టినరోజు తరువాత వోల్ఫ్‌గాంగ్ కొత్త జీవితం ప్రారంభించాలని ప్లాన్ చేస్తాడు. దానికి తగ్గట్టుగా డూప్లికేట్ ఐడీలను కూడా రెడీ చేస్తాడు. 3096వ రోజు అంటే 2006 ఆగస్టు 23న నటాషాకు తప్పించుకునే అవకాశం వస్తుంది. మరి ఇప్పుడైనా ఆ అమ్మాయి తప్పించుకుందా ? 3096 రోజులు ఆమె జీవితంలో ఏం జరిగింది? చివరకు ఆ సైకో ఏమయ్యాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.