Walking After Eating:భోజనం తర్వాత నడవడం అనేది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, బరువు తగ్గడానికి సహాయపడే సరళమైన, ప్రభావవంతమైన అలవాటు. భోజనం చేసిన వెంటనే కాస్తయినా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం లేదా ఊబకాయంతో బాధపడేవారికి నడక చాలా మేలు చేస్తుందట.
నడక వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే మాత్రం భోజనం చేసిన తర్వాత ఎప్పుడు, ఎంతసేపు నడవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
భోజనం చేసిన తర్వాత నడవడానికి సరైన సమయం:
నిపుణుల అభిప్రాయం ప్రకారం భోజనం చేసిన 10 నుండి 15 నిమిషాలలోపు కాసేపయినా నడవడం చాలా ప్రయోజనకరం. ఈ సమయంలో నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే, మీరు ఎక్కువ మోతాదులో తిన్నట్లయితే, జీర్ణ ప్రక్రియ ప్రారంభమై అసౌకర్యాన్ని నివారించడానికి 30 నిమిషాలు వెయిట్ చేయడం చాలా మంచిది.
నడక సమయం , వేగం:
తిన్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు నెమ్మదిగా నడిచినా కూడా సరిపోతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీరు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. భోజనం తర్వాత 30 నిమిషాల నడక మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, నడక వేగం మాత్రం నెమ్మదిగా ఉండాలి. తినగానే వేగంగా నడవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర నియంత్రణ: తిన్న తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నడక జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడం: భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
మానసిక స్థితిని మెరుగుదల: నడక ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. అంతే కాకుండా ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
Also Read: ముఖంపై మచ్చలు తగ్గి, తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ముఖ్యమైన విషయాలు:
మీరు ఎక్కువ మోతాదులో భోజనం తిన్నట్లయితే, నడకకు వెళ్లే ముందు 30 నిమిషాలు ఆగండి.
నడక వేగాన్ని మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి. చాలా వేగంగా నడవడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.
నడుస్తున్నప్పుడు మీకు తల తిరుగుతున్నట్లు, అలసిపోయినట్లు లేదా కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే.. నడవడం మానేసి విశ్రాంతి తీసుకోండి.