OTT Movie : యూత్ ని ఆకట్టుకునే కంటెంట్ తో ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఎస్టర్ నోరోన్హా తన అందాలతో కనువిందు చేసింది. ఇందులో అద్దెకు వచ్చిన ఒక కుర్రాడు ఇంటి ఓనర్ తో ఎఫ్ఫైర్ పెట్టుకుంటాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా యువత ప్రేమ ఫాంటసీలు, సమాజంలోని సమస్యలతో కొంత వివాదాస్పద కంటెంట్ తో రూపొందింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
’69 Samskar Colony’ 2022లో విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీకి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ఎస్టర్ నోరోన్హా, రిష్వి తిమ్మరాజు, అజయ్, సిల్పా నాయక్, బద్రం, ఎఫ్‌ఎం బాబాయ్ నటించారు. ఈ చిత్రం 2022 మార్చి 18న థియేటర్లలో విడుదలై, 2022 ఆగస్టులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. 1 గంట 56 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.4/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
కౌశిక్ (రిష్వి తిమ్మరాజు) అనే ఒక టీనేజ్ అబ్బాయి, తన కుటుంబంతో కలిసి ఒక సిటీలోని సంస్కార్ కాలనీలో అద్దె ఇంటికి వస్తాడు. ఈ కాలనీలో ఇంటి ఓనర్ వైశాలి (ఎస్టర్ నోరోన్హా) అనే వివాహిత, తన అందం, చలాకీతనంతో కౌశిక్‌ని ఆకర్షిస్తుంది. కౌశిక్ ఆమెపై ప్రేమలో పడతాడు. కానీ వైశాలి ఒక వివాహిత కావడంతో ఈ ప్రేమ సమాజంలో తప్పుగా ఉంటుంది. కౌశిక్ యౌవన ఫాంటసీలు, ప్రేమ ఊహలతో వైశాలితో సన్నిహితంగా మెలుగుతాడు. వైశాలి కూడా అతనితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య సంబంధం శారీరకంగా కూడా ముందుకు సాగుతుంది. ఇది కౌశిక్ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తుంది. ఈ సంబంధం కారణంగా కౌశిక్ తన కుటుంబంతో, సమాజంతో ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
వైశాలి భర్త సంతోష్ (అజయ్), కాలనీలోని ఇతర వ్యక్తుల వల్ల కథ మలుపులు తిరుగుతుంది. సినిమా కౌశిక్ ఫాంటసీలు, అతని ప్రేమ వల్ల వచ్చే పరిణామాలు, సమాజంలో ఇలాంటి సంబంధాలు యువత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాలను చూపిస్తుంది. కౌశిక్ ఈ అనుభవం నుంచి ఒక గుణపాఠం నేర్చుకుంటాడు. కానీ ఈ ప్రయాణంలో అతని జీవితం ఎలా మారిపోతుందనేది కథలోని క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? వైశాలిని దూరం చేసుకుంటాడా ? ఆమె భర్త ఎలా రియాక్ట్ అవుతాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఇంటి దొంగని ఈశ్వరుడే పడతాడా ? సీరియల్ కిల్లర్ కన్నా ఆమె మొగుడే డేంజర్..