E-Paper
Advertisement

రివేంజ్ నుంచి ఇంటెన్స్ థ్రిల్లర్ల వరకు… ఈ వీకెండ్ కు బెస్ట్ హిందీ మూవీస్ ఇవే

రివేంజ్ నుంచి ఇంటెన్స్ థ్రిల్లర్ల వరకు… ఈ వీకెండ్ కు బెస్ట్ హిందీ మూవీస్ ఇవే
Advertisement

Suspense Thrillers OTT : సస్పెన్స్, మైండ్ గేమ్స్, ఆశ్చర్యకరమైన మలుపులున్న సినిమాలంటే మూవీ లవర్స్ క్రేజీగా ఫీల్ అవుతారు. అయితే ఈ అంశాలన్నీ ఉన్న సినిమాలు, ఇంకా ఆడియన్స్ దృష్టిలో పడని ఆణిముత్యాలు ఈరోజు మన మూవీ సజెషన్. ఈ బాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీస్ ప్రేక్షకులను మొదలు నుండి చివరి వరకు కట్టిపడేస్తాయి. ఇందులో అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించకపోయి ఉండవచ్చు. కానీ ఈనాటికీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆ సినిమాలు ఏంటో, ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

‘ఎ డెత్ ఇన్ ది గుంజ్’

A Death in the Gunj మూవీ 2016లో విడుదలైన సెన్సిటివ్, ఇంట్రెస్టింగ్ మూవీ. శుతు అనే యువకుడి కథ ఈ మూవీ. అతను తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతాడు. కానీ అతన్ని అందరూ వేధింపులకు గురి చేయడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల అతను మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. ఆ తరువాత ఏం చేశాడు ? అన్నది స్టోరీ. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

ఇత్తెఫాఖ్

Advertisement

‘ఇత్తెఫాఖ్’ (Ittefaq) అనే మిస్టరీ థ్రిల్లర్ 2017లో విడుదలైంది. జంట హత్యల కేసు దర్యాప్తు ఆధారంగా సాగే సినిమా ఇది. పోలీస్ అధికారి దేవ్, విక్రమ్ – మాయ అనే ఇద్దరు సాక్షులు ఇందులో కీలకంగా ఉంటారు. కానీ వారిద్దరూ వేర్వేరు స్టోరీలు చెబుతారు. నిజం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చివరిదాకా చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రతి మలుపులోనూ ఆడియన్స్ కు కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు

నో స్మోకింగ్

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన మూవీ ‘నో స్మోకింగ్’ (No Smoking). ఊహించని మలుపులతో కూడిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చైన్ స్మోకింగ్ చేసే వ్యక్తి తన అలవాటును మానుకోవడానికి ఒక సీక్రెట్ అడిక్షన్ సెంటర్ కి వెళ్తాడు. కానీ అక్కడ అతను ఊహించని భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఈ సినిమా క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుంది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read : క్లైమాక్స్ వరకు ఇలాంటి హీస్ట్ సినిమాలను చూస్తే పిచ్చెక్కిపోద్ది

ఫోబియా

2016లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఫోబియా’ (Phobia Movie 2016). ఈ మూవీ మెహక్ అనే కళాకారిణి చుట్టూ తిరుగుతుంది. ఆమె లైఫ్ లో ఒక బాధాకరమైన సంఘటన జరుగుతుంది. దీంతో హీరోయిన్ కి బహిరంగ ప్రదేశాలంటే భయపడే వింత సమస్య అగోరాఫోబియా వస్తుంది. కొత్త అపార్ట్‌మెంట్‌ లోకి మారిన తర్వాత ఆమెకు వింతైన, భయానకమైన అనుభవాలు ఎదురవుతాయి. ఇవి కేవలం భ్రమలా, లేక నిజంగానే ఏదైనా దుష్టశక్తి ఆమెను వెంటాడుతోందా? అనేది తెలియాలంటే ఈ మూవీని జీ5లో చూడవచ్చు.

అగ్లీ

అనురాగ్ కశ్యప్ ‘అగ్లీ’ (Ugly 2013) మూవీ ఇంటెన్స్ గా ఉండి, ఆడియన్స్ ను కలవరపరిచే థ్రిల్లర్. ఒక చిన్నారి అదృశ్యంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎమోషనల్ గా తీవ్రంగా కదిలిస్తుంది. దీన్ని మీరు జీ5లో చూడవచ్చు.

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×