E-Paper
Advertisement

నేరస్థులను లేపేసే అమాయకపు సైకో… కామెడీతో పాటు క్రైమ్ ఉన్న కొరియన్ సిరీస్

నేరస్థులను లేపేసే అమాయకపు సైకో… కామెడీతో పాటు క్రైమ్ ఉన్న కొరియన్ సిరీస్
Advertisement

Korean Crime Thriller: సైకోలు అంటే ఎలా ఉంటారు ? ఇప్పటిదాకా మనం చూసిన సిరీస్, సినిమాలను బట్టి చూస్తే… వాళ్లకు మానసికంగా ఏదైనా జబ్బు ఉండడం వల్ల ఎదుటి వాళ్ళను చంపుతారు. లేదా పగతోనో, తమకు జీవితంలో ఎదురైన దారుణమైన పరిస్థితుల వల్ల సైకోలుగా మారతారు. అయితే అన్ని సినిమాలలోనూ సైకోలే విలన్లు. కానీ హీరో సైకో అయితే ఎలా ఉంటుంది ? అందులోనూ ఆ సైకో హీరోకి సూపర్ పవర్స్ ఉంటే ? వినడానికి క్రేజీగా ఉన్నా ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. అదే కొరియన్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఎ కిల్లర్ పారడాక్స్’ (A Killer Paradox).

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ ఒక అమాయకుడు అనుకోకుండా సీరియల్ కిల్లర్‌గా ఎలా మారాడు ? అతడిని పట్టుకోవడానికి ఒక తెలివైన డిటెక్టివ్ ఎలాంటి వేట సాగించాడు ? అనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ తిరుగుతుంది. లీ టాంగ్ అనే కాలేజీ విద్యార్థి ఇందులో హీరో. అతను ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో పార్ట్-టైమ్ జాబ్ చేస్తుంటాడు. ఒకరోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఒక కస్టమర్‌ తో గొడవ జరుగుతుంది. ఆవేశంలో అతనిపై దాడి చేసి అనుకోకుండా అతడిని చంపేస్తాడు. తను ఇలా మనిషిని ఎలా చంపేసాను అనే భయంతో వణికిపోతుంటాడు.

Advertisement

కానీ లీ టాంగ్ చంపిన వ్యక్తి సాధారణమైన వాడు కాదని, అతను గతంలో ఎన్నో ఘోరమైన నేరాలు చేసిన ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. విచిత్రం ఏమిటంటే, లీ టాంగ్ చేసిన హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించవు. దీనితో లీ టాంగ్‌కు ఒక వింత అతీంద్రియ శక్తి ఉందని అర్థమవుతుంది. సమాజంలో తిరుగుతున్న దుర్మార్గులను, క్రూరమైన నేరస్థులను గుర్తించే సిక్స్త్ సెన్స్ అతనిలో మేల్కొంటుంది. ఈ శక్తులతో అతను సమాజంలోని చట్టం నుండి తప్పించుకు తిరుగుతున్న కిరాతకులను, రేపిస్టులను వెతికి మరీ చంపడం ప్రారంభిస్తాడు.

చట్టం శిక్షించలేని నేరస్థులను తనే శిక్షిస్తూ ‘గాడ్‌సెంట్ హీరో’గా మారుతాడు. అయితే అతను చేసే ప్రతి హత్య తాలూకూ ఆధారాలు ఏదో ఒక రూపంలో దానంతట అదే మాయమైపోతుంటాయి. ఈ వింత హత్యల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి డిటెక్టివ్ జాంగ్ నాన్-గామ్ రంగంలోకి దిగుతాడు. నాన్-గామ్ చాలా మొండివాడు, తెలివిగలవాడు. లీ టాంగ్ వైపు ఆధారాలు ఏవీ చూపించకపోయినా, అతనిపైనే అనుమాన పడతాడు. ఈ వేటలో లీ టాంగ్ దొరికాడా ? ఒక హంతకుడిని పట్టుకునే క్రమంలో డిటెక్టివ్ ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు ? లీ టాంగ్ తన శక్తిని మంచి కోసం వాడుతున్నాడా లేదా ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

Advertisement

Read Also: కారు ప్రమాదం… కళ్ళు తెరిచి చూస్తే మరో ప్రపంచంలో… మైండ్ బెండింగ్ సై-ఫై సిరీస్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×