E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన శ్రీయ.. అవని పై సీరియస్.. బిడ్డ రాకతో ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన శ్రీయ.. అవని పై సీరియస్.. బిడ్డ రాకతో ఫుల్ హ్యాపీ..
Advertisement

Intinti Ramayanam Today Episode july 3rd: పార్వతి భానుమతి ఇద్దరు కూడా శ్రేయ కి బాబు పుట్టాడని తెలుసుకొని సంతోషంగా ఉన్నా కూడా.. తనకి అనారోగ్య సమస్య ఉంది అని చెప్పగానే కాళ్లు చేతులు ఆడడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటారు.. బాబుకి ఎలా ఉందో అసలు ఆశ్రియా పరిస్థితి ఎలా ఉందో అని భానుమతి కంగారు పడిపోతూ ఉంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కమల్.. బాబు పరిస్థితి మొదట బాగోలేదని అన్నారు.. కానీ అవని వదిన తన కిడ్నీని డొనేట్ చేసి దేవతగా మారిపోయింది అమ్మ నిజంగానే తను చాలా గ్రేట్ అని కమల్ చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా అవని చాలా గ్రేట్ అని పొగిడిస్తూ ఉంటారు.. అది విన్న పల్లవి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది.. పల్లవి కూడా పూర్తిగా మారిపోతే బాగుంటుంది అని మీనాక్షి కూడా అంటుంది. అయితే శ్రియ అవని ఇద్దరూ కలిసిపోయారు అని పార్వతి చాలా సంతోషంగా ఉంటుంది..

బిడ్డ రాకతో అంతా హ్యాపీ..

బిడ్డ పుట్టాడని తెలిసినప్పటి నుంచి పార్వతి కాళ్లు చేతులు ఆడడం లేదు. ఎప్పుడు ఎప్పుడు తన మనవడిని చూసుకొని చేతుల్లోకి తీసుకొని మురిసిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆరాధ్య పొద్దున్నే లేవగానే రెడీ అయ్యి బయట వెయిట్ చేయడం చూసిన పార్వతీ, మీనాక్షి నువ్వెక్కడున్నావా.. నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాము అని అంటారు. ఏంటి ఇంత పొద్దున్నే బయట వెయిట్ చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అమ్మ ఆరాధ్య అని అంటారు. తమ్ముడు వస్తున్నాడు కదా తమ్ముడు కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని ఆరాధ్య చెప్తుంది.. అయితే మేము కూడా మా మనవడు కోసం 1000కలతో ఎదురుచూస్తున్నాము అని వాళ్ళు అనగానే కమల్ రెండు కళ్ళకు అయితే ఓకే ఈ కళ్ళకి కళ్ళజోడు పెట్టాలంటే కష్టం అని కామెడీ చేస్తాడు.. అప్పుడే శ్రేయ వాళ్ళు రాగానే అందరూ సంతోషంగా బయటికి వెళ్తారు..

పల్లవికి ఘోర అవమానం..

Advertisement

పల్లవి వీళ్ళ సంతోషాన్ని చూసి ఓరో లేకపోతున్నాను అని అనుకుంటుంది. వీళ్ళందరూ ఈ బిడ్డ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా సంతోషాన్ని చూసి నాకు కడుపు రగిలిపోతుంది అని పల్లవి అనుకుంటుంది. అందరూ సంతోషంగా బయటికి వెళ్లి బాబును చూసి చాలా బాగున్నాడు అంటూ పొగిడేస్తూ ఉంటారు. అవని వల్లే మా బాబు బతికాడు అని శ్రేయవాళ్లు చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు.. అయితే పల్లవిని బాబుకి దిష్టి తీయాలి వెళ్లి డిస్టిప్లేటు తీసుకురమ్మని పార్వతి పంపిస్తుంది.. అది చూసిన శ్రీయ పల్లవి నా బిడ్డకి దిష్టి తీయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది.. తను ఎప్పుడూ మంచి మనసుతో ఆలోచించలేదు అలాంటిది ఇప్పుడు నా బిడ్డకు తీస్తే తన పరిస్థితి కూడా అలానే ఉంటుంది నాకు ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్పడంతో పల్లవి షాక్ అవుతుంది.. పల్లవి తనకి అవమానంగా ఫీల్ అయ్యి పక్కన నిలబడుతుంది.

అవనిపై ప్రశంసలు..

నా బిడ్డ మంచి కోరే అవని అక్కని తనకి దిష్టి తీయాలి అని శ్రీయా అనడంతో పల్లవి కుళ్ళుకొని పక్కకు వెళ్ళిపోతుంది.. నా బిడ్డ ఈరోజు బతుకు ఉండడానికి కారణం అవని అక్కనే.. తన వల్లే నా బిడ్డ ఈరోజు ప్రాణాలతో బతికి ఉంది అని పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. అనే నా బిడ్డని ప్రాణాలతో చూసేలా చేసింది అని అవనిపై రేయాలతో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.. అయితే పల్లవి నేను హంతకురాలిని చేయాలని చూస్తే ఇప్పుడు దేవతై కూర్చుంది అని తెగ బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక అవని బిడ్డకి శ్రేయ వాళ్ళకి హారతి ఇస్తుంది.. అటు అక్షయ్ అవినీతి సర్జరీ జరిగిందమ్మ తనకి కూడా దిష్టి తీయాలి అని అంటాడు. ఇక శ్రీయ కూడా అవును అత్తయ్య అవని అక్క చాలా మంచిది తనకి కూడా దిష్టి తగిలింది మీరు తనకి దిష్టి తీయండి అని అంటుంది.. ఆ మాట విన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

పల్లవికి కమల్ షాక్..

Advertisement

పల్లవి ఒకటే పైన కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆవని హంతుకురాలిని చేద్దామని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. కానీ తను చేసిన ఒక్క పని వల్ల అందరూ దృష్టిలో దేవతగా మారిపోయింది అని పల్లవి పుల్లతో తెగ బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడికొచ్చిన కమల్ పల్లవిని చూసి ఓ అవని వదిన ఇప్పుడు చాలా మంచిదని అందరూ పొగిడేసారు కదా నువ్వు చాలా బాధపడిపోతున్నావేమో అని అంటాడు. నేనెందుకు బాధ పడిపోతాను నాకేం అవసరమని పల్లవి అంటున్న సరే కమల్ మాత్రం నీ బుద్ధి అంటే నాకు బాగా తెలుసు అని దారుణంగా తిడతాడు. పవని వదిన మంచి పని చేస్తుంది కాబట్టే ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బిడ్డను కాపాడింది అని కమల్అవనిని పొగిడేస్తూ ఉంటాడు. మీ వదిన అంత మంచిదాన్ని కాదు. ప్రాణాలకు తెగించి అంత త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు అని పల్లవి అంటుంది. కమల్ ఆ మాట అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పల్లవి..

బాబు రాకతో ఇళ్లంతా హ్యాపీ..

బాబు ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా మా ఇంటికి వారసుడు వచ్చారు అని చాలా సంతోషంగా ఉంటారు.. అందరూ మధ్యలో కూర్చొని బాబుని పెట్టి సంతోషంగా నవ్వుతూ ఉండడం చూసిన పల్లవి కడుపు రగిలిపోతుంది అని కోపంగా అందరిని చూస్తుంది. ఈ బిడ్డ రాక వల్ల మళ్లీ అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అది నాకు నచ్చలేదు అని అనుకుంటుంది. ఆరాధ్య బాబుతో నేను మాత్రమే ఆడుకోవాలి ఎవరికి ఇవ్వను అని అనడం చూసి అందరూ నవ్వుకుంటారు. ఆవుని రెడీ చేయడానికి ఇవ్వమ్మా అని అవని చెప్పిన సరే ఆరాధ్య మాత్రం నేను పడుకున్న తర్వాతే మీరు బాబుని తీసుకోవాలి అప్పటివరకు నాతోనే ఉంటాడు అని అనడంతో అందరూ నవ్వుకుంటారు. ఇక చక్రధర్ బాబుతో ఆడుకుంటూ నేను రా మీ తాతయ్యని అని అనడంతో పల్లవి అతని చూసి మా మామ్చనిపోయింది అన్న బాధ కూడా ఈయనకి లేదు అని అనుకుంటుంది.. అందరూ భోజనం చేస్తూ ఉండగా పల్లవి మాత్రం నాకు వద్దు అని బయటకు వచ్చేస్తుంది. పల్లవికి భోజనం తీసుకెళ్లిన మీనాక్షిని పల్లవి గోరంగా అవమానిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది చూడాలి..

Also Read :పవిత్ర నాయక్ ఇంత షాకిచ్చేందేంటి? ఇన్నాళ్లు బయటపడ్డ నిజం..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి షాకివ్వబోతున్న నర్మదా.. ప్రేమ పరిస్థితి దారుణం..  ధీరజ్ దెబ్బకు రాజాపుష్పంకు ఫ్యూజుల్ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode July 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ   

Brahmamudi Serial Today Episode July 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తిట్టి  లక్ష్మీని తీసుకుని వెళ్లిపోయిన చలపతి

Nindu Manasulu Prerana : పవిత్ర నాయక్ ఇంత షాకిచ్చేందేంటి? ఇన్నాళ్లు బయటపడ్డ నిజం..

Today Movies in Tv : సినీ ప్రియులకు మాస్ జాతర.. శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Podarillu Narayana : ‘ పొదరిల్లు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నారాయణ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..

Big Stories

×