E-Paper
Advertisement

బ్రూటల్ మర్డర్స్… కలియుగాన్ని స్థాపిస్తానని మంకు పట్టు… ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అస్సలు మిస్ అవ్వొద్దు

బ్రూటల్ మర్డర్స్… కలియుగాన్ని స్థాపిస్తానని మంకు పట్టు… ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Crme Thriller Series : హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు, వెబ్ సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘అసుర్’ చాలా స్పెషల్. 2020లో విడుదలై మూడేళ్ల తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన ఈ సిరీస్ సస్పెన్స్, ఉత్కంఠ, మిథాలజీ, సైన్స్ కలయికతో మంత్రముగ్ధులను చేస్తుంది. రెండు సీజన్‌లు విడుదలైన ఈ సిరీస్ ఒక్కసారి చూడటం మొదలుపెడితే ఎపిసోడ్‌లు ముగిసే వరకు స్క్రీన్ ముందు నుంచి పక్కకు కదలకుండా కట్టిపడేస్తుంది.

‘అసుర్’ సిరీస్ ప్రత్యేకత

‘అసుర్: వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్’ అనే పేరుతో వచ్చిన ఈ సిరీస్ హిందూ పురాణాలను ఆధునిక ఫోరెన్సిక్ సైన్స్‌తో మేళవించి ఒక అద్భుతమైన కథను అందిస్తుంది. సీరియల్ కిల్లర్ తనను తాను “అసుర్”గా భావించుకుని, పురాణాలలోని రాక్షసుల ఆలోచనలను ఆధారంగా చేసుకుని నేరాలు చేస్తాడు. ఈ క్రూరమైన వ్యక్తిని అడ్డుకోవడానికి సీబీఐ ఫోరెన్సిక్ నిపుణులు చేసే ప్రయత్నాలు సిరీస్‌ లో నరాలు కట్టయ్యే సస్పెన్స్ ను క్రియేట్ చేస్తాయి. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ట్విస్ట్‌లు, పురాణాల సందేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సాధారణ క్రైమ్ స్టోరీ కాకుండా, మంచి-చెడు మధ్య జరిగే ఫిలాసఫికల్ పోరాటంలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

కథలోకి వెళ్తే…

Advertisement

2020 మార్చిలో విడుదలైన మొదటి సీజన్‌లో కథ వారణాసి నేపథ్యంలో సాగుతుంది. తనను తాను “అసుర్” అని పిలుచుకునే ఒక తెలివైన సీరియల్ కిల్లర్ భయంకరమైన హత్యలు చేస్తాడు. ఈ కేసును ఛేదించడానికి సీబీఐ అధికారి ధనంజయ్ రాజ్‌పుత్ (DJ) (అర్షద్ వార్సి), ఫోరెన్సిక్ నిపుణుడు నిఖిల్ నాయర్ (బరున్ సోబ్తి) కలిసి పని చేస్తారు. 17 ఏళ్ల వయసులోనే విశేష్ బన్సల్ పోషించిన శుభ్ జోషి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతని ఇంటెన్స్ యాక్టింగ్, అర్షద్ వార్సి, బరున్ సోబ్తి వంటి సీనియర్ నటులను కూడా మించిపోయిందని ప్రశంసలు వచ్చాయి. అనుప్రియ గోయెంకా, రిద్ధి డోగ్రా, అమే వాఘ్ వంటి నటీనటులు కూడా బాగా నటించారు.

ఇక 2023లో విడుదలైన రెండవ సీజన్ లో మొదటి సీజన్ కథను మరింత ఇంటెన్స్ గా కంటిన్యూ చేశారు. శుభ్ జోషి “కాళి” అవతారంగా మారి కలియుగాన్ని స్థాపించాలని నిర్ణయించుకుంటాడు. ధనంజయ్, నిఖిల్ ఈ భయంకర రాక్షసుడిని అడ్డుకోవడానికి ఆధునిక టెక్నాలజీ, ఏఐ (Artificial Intelligence) సాయంతో పోరాడతారు. ఈ సీజన్‌లో కొత్త పాత్రలు, ట్విస్ట్‌లు, డీప్ ఫిలాసఫీ ప్రేక్షకులను మరింత ఆకర్షించాయి. మొత్తం రెండు సీజన్‌లలో 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి.

Advertisement

దర్శకుడు ఓని సేన్ తన డైరెక్షన్‌తో సిరీస్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. గౌరవ్ శుక్లా క్రియేషన్, రచన ఈ సిరీస్‌కు ప్రధాన బలం. IMDbలో 8.5 రేటింగ్‌ ఉన్న ఈ సిరీస్ ఎన్నో అవార్డులను అందుకుంది. అర్షద్ వార్సి దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డు వంటి గౌరవాలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ సిరీస్ JioCinemaలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ తో పాటు మిథాలజీని ఇష్టపడేవారు, తెలివైన థ్రిల్లర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Read Also : సముద్రం మధ్యలో చావును వెతుక్కుంటూ వెళ్ళే ఫ్రెండ్స్… ఈ హార్రర్ మూవీ క్లైమాక్స్ కేక

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×