E-Paper

‘రాఖ్’ నుండి ‘ది రైల్వే మ్యాన్’ వరకు… వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు

‘రాఖ్’ నుండి ‘ది రైల్వే మ్యాన్’ వరకు… వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు
Advertisement

Best Thriller Series : ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్‌లతో నిండిపోయాయి. నేరాలు, ప్రమాదాలు, రహస్యాలు, సామాజిక విషాదాలు వంటి అంశాలు ప్రేక్షకులను తీవ్రంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన సిరీస్‌లు మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంటాయి. అలా ఇప్పటిదాకా ఓటీటీలలో వచ్చిన బెస్ట్ సిరీస్ లే ఈరోజు మన మూవీ సజెషన్.

1. రాఖ్ (Raakh) – రంగా-బిల్లా కేసు స్ఫూర్తితో

అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాఖ్’ సిరీస్ ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలై భారీ సంచలనం సృష్టించింది. 1978లో జరిగిన ప్రసిద్ధ రంగా-బిల్లా కేసు ఆధారంగా రూపొందిన డార్క్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. గీతా – సంజయ్ చోప్రా కిడ్నాప్, హత్య కేసును కేంద్రంగా చేసుకుని తెరకెక్కించారు. అలీ ఫజల్ కొత్త పోలీస్ ఆఫీసర్‌గా, సోనాలి బింద్రె, ఆమిర్ బషీర్‌ వంటి స్ట్రాంగ్ కాస్ట్ ఉంది ఇందులో. న్యూఢిల్లీలో టీనేజర్ల కిడ్నాప్ కేసును ఛేదించే ప్రయాణం సస్పెన్స్‌తో నిండి ఉంటుంది. ఈ సిరీస్ 1970ల చీకటి రాజకీయాలు, నేరాలు, పోలీసు వ్యవస్థ వంటి విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

2. భయ్ – ది గౌరవ్ తివారీ మిస్టరీ – పారానార్మల్ థ్రిల్లర్

Advertisement

పారానార్మల్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఇది అదిరిపోయే ఆప్షన్. భారతదేశపు మొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ జీవితం, 2016లో అతని మిస్టీరియస్ మరణం చుట్టూ తిరిగే ఈ సిరీస్ ప్రేక్షకులకు భయంకరమైన అనుభూతిని కలిగిస్తుంది. కరణ్ టాకర్, కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియన్ పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపకుడైన గౌరవ్ తివారీ జీవితంలోని రహస్యాలు, ఆత్మలు, అతీంద్రియ సంఘటనలు ఈ సిరీస్‌లో ఉత్కంఠగా చిత్రీకరించారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

3. ది రైల్వే మ్యాన్ – భోపాల్ గ్యాస్ ట్రాజెడీ

1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన భారత చరిత్రలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తు. ఈ దుర్ఘటనలో లెక్కలేనన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ‘ది రైల్వే మ్యాన్ సిరీస్’ ఆ దుర్ఘటన వెనుక ఉన్న బయటపడని నిజాలు, అధికారుల నిర్లక్ష్యం, బాధితుల కష్టాలను హృదయ విదారకంగా చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పర్యావరణం, పరిశ్రమలు, ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇది కేవలం ఒక దుర్ఘటన కథ కాదు, మానవత్వం, న్యాయం కోసం పోరాటం కూడా.

4. హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్

Advertisement

2018లో ఢిల్లీలోని బురారీలో జరిగిన విచిత్రమైన సంఘటన ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయింది. భాటియా కుటుంబంలోని 11 మంది సభ్యుల మరణాలు ఎలా జరిగాయి ? ఆత్మహత్యలా ? హత్యలా ? లేదా వేరే ఏదైనా రహస్యమా ? అనేది ఇప్పటికీ మిస్టరీనే. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ లో ఈ కేసును లోతుగా విశ్లేషించారు. ఆధారాలు, సాక్షులు, పోలీసు దర్యాప్తు వివరాలు ఉత్కంఠభరితంగా చూపించారు. రహస్యాలు, అంధవిశ్వాసాలు, కుటుంబ బంధాలు కలిసిన ఈ సిరీస్ కలవర పెడుతుంది.

5. ట్రయల్ బై ఫైర్ – ఉఫార్

1997లో ఢిల్లీలోని ఉఫార్ సినిమా హాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం భారతదేశాన్ని కంపింపజేసింది. 59 మంది (23 మంది పిల్లలతో సహా) ప్రాణాలు కోల్పోయారు. ‘ట్రయల్ బై ఫైర్’ సిరీస్ లో ఈ విషాదం తర్వాత ఇద్దరు తల్లిదండ్రులు 25 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటాన్ని హర్ట్ టచింగ్ గా చిత్రీకరించారు. 7 ఎపిసోడ్‌లతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ సినిమా హాల్ సేఫ్టీ, కార్పొరేట్ నిర్లక్ష్యం, న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టుతుంది. భావోద్వేగాలు, కోపం, నిరాశ కలిసిన ఈ కథ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ సిరీస్‌లన్నీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని తీయడం వల్ల మరింత ఆసక్తికరంగా ఉంటాయి.

Read Also : ఊరినే వల్లకాడుగా మార్చే ఒకే ఒక్క పొరపాటు… సింగిల్ గా చూశారో ఫసక్

Tags

Related News

ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం థ్రిల్లర్లు… అన్నీ తెలుగులోనే

బ్రూటల్ మర్డర్స్… కలియుగాన్ని స్థాపిస్తానని మంకు పట్టు… ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అస్సలు మిస్ అవ్వొద్దు

పదేళ్లుగా ఒకే అద్దె కొంపలో… కట్ చేస్తే కన్నీళ్లు పెట్టించే ట్విస్ట్

ఇదెక్కడి విడ్డూరం… నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన పాత వెబ్ సిరీస్

7 ఏళ్ల నాటి ఫ్లాప్ సినిమా ట్రెండింగ్లో… ఇంకా చూడలేదా ?

థ్రిల్లర్ నుంచి యాక్షన్ వరకు… ప్రైమ్ వీడియోలోకి వచ్చిన కొత్త సినిమాలు

‘ఇక్కా’ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

×