E-Paper
Advertisement

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో
Advertisement

Emotional Family Drama: అమ్మ తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. కానీ అదే అమ్మకు మరోసారి కొత్త జీవితం ప్రారంభించే అవకాశం వస్తే… ఆమె పిల్లలు ఎలా స్పందిస్తారు ? సమాజం ఏమంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానంగా వచ్చే సినిమాలు చాలా అరుదు. అలాంటి సున్నితమైన అంశాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పే చిత్రమే Vanda Devullu. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో కుటుంబ బంధాలు, తల్లి త్యాగం, మహిళల జీవితంపై సమాజం చూపే దృక్పథాన్ని హార్ట్ టచింగ్ గా ఆవిష్కరించారు. మరి ఈ మూవీ ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉందా ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాసుకి తన ఇద్దరు కొడుకులే ప్రపంచంగా జీవిస్తుంది. కూలీ పనులు చేస్తూ, ఎన్నో అవమానాలు భరిస్తూ, సమాజం వేసే వంకర చూపులను తట్టుకుంటూ పిల్లలను పెద్ద చేస్తుంది. తన జీవితంలోని ప్రతి ఆనందాన్ని త్యాగం చేసి వారి భవిష్యత్తు కోసం కష్టపడుతుంది.

Advertisement

సంవత్సరాలు గడుస్తాయి. పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. కానీ వాసుకి జీవితంలో మాత్రం ఒంటరితనం మరింత పెరుగుతుంది. చివరకు తనకు కూడా ఒక తోడు కావాలని, మిగిలిన జీవితాన్ని ఎవరో ఒకరితో ప్రశాంతంగా గడపాలని డిసైడ్ అవుతుంది. అయితే ఈ నిర్ణయం ఆమె కుటుంబంలోనే పెద్ద తుఫాన్‌కు కారణమవుతుంది.

మొదట తల్లి రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించిన కొడుకులు… ఆమె జీవితంలో దాగి ఉన్న బాధను, తమ కోసం చేసిన త్యాగాలను క్రమంగా అర్థం చేసుకుంటారు. అప్పటివరకు తాము చూడని అమ్మ జీవితాన్ని తెలుసుకున్న తర్వాత వారి ఆలోచన పూర్తిగా మారిపోతుంది. తల్లి సంతోషం కోసం సమాజాన్నే ఎదిరించాలని డిసైడ్ అవుతారు.

Advertisement

కానీ వారి ముందున్న అడ్డంకులు చిన్నవి కావు. బంధువులు, ఊరి పెద్దలు, సంప్రదాయాలు… అందరూ ఈ నిర్ణయాన్ని తప్పుబడతారు. అలాంటి పరిస్థితుల్లో కొడుకులు తమ తల్లి కోసం ఎలా నిలబడ్డారు ? ఆమె కోరుకున్న జీవితాన్ని ఇవ్వగలిగారా ? చివరకు ఈ కుటుంబానికి ఎలాంటి ముగింపు దక్కింది ? అనేది సినిమాలోని ప్రధాన భావోద్వేగ ప్రయాణం.

ఓటీటీలో తెలుగులో

ప్రస్తుతం ‘వంద దేవుళ్ళు’ మూవీ ZEE5లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ ఆంటోనీ కీలక పాత్రలో కనిపించగా, శ్వాసిక విజయ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. కుటుంబ విలువలు, మహిళల ఆత్మగౌరవం, వితంతువుల పునర్వివాహం వంటి సున్నితమైన అంశాలను దర్శకుడు శశి సినిమాలో అద్భుతంగా చూపించారు. మనసును తాకే మంచి ఎమోషనల్ కథ చూడాలనుకుంటే ఈ మూవీ పర్ఫెక్ట్. తల్లి ప్రేమకు నిజమైన అర్థం ఏమిటో, ఆమె సంతోషం కోసం పిల్లలు ఎంత దూరం వెళ్లగలదొ చూపించే ఈ సినిమా… చివరికి ప్రేక్షకుడి మనసును కదిలిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చూసే మంచి ఎమోషనల్ డ్రామా ఇది. మిస్ అవ్వకుండా చూడండి.

Read Also: రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

Tags

Related News

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్.. ఒక్కరోజు 14 సినిమాలు స్ట్రీమింగ్..!

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం… రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

Big Stories

Advertisement
×